08-01-2026 12:04:12 AM
ఎల్బీనగర్, జనవరి 7 : తెలిసీతెలియని వయసులో ప్రేమలో పడిన ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నారు. ప్రేమించిన వ్యక్తినే పెండ్లి చేసుకుంటానని పట్టుపట్టడంతో తల్లిదండ్రులు మందలించారు. దీంతో ఈ నెల 6న మైనర్ అమ్మాయి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. విషయం తెలుసుకున్న ప్రియుడు మనస్తాపం చెంది బుధవారం ఉదయం ఓ వెంచర్‌లో నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకునన ఘటన హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బ్రాహ్మణపల్లి గ్రామంలో వెలుగులోకి వచ్చింది.
రంగారెడ్డి జిల్లా యాచారం మండలం మేడిపల్లి గ్రామానికి చెందిన సిద్దగోని మహేశ్ (21) ఆటోడ్రైవర్‌గా పని చేస్తున్నాడు. ఇతను యాచారం మండలానికి చెందిన బంధువుల అమ్మాయి పూజ(17)ని ప్రేమించాడు. వీరి ప్రేమ వ్యవహారం అమ్మాయి ఇంట్లో తెలిసి, మందలిం చడంతో ఈ నెల 6న మైనర్ అమ్మాయి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ప్రేమించిన అమ్మాయి ఉరేసుకున్న విషయం తెలుసుకున్న మహేశ్ తీవ్ర మనస్తాపం చెందాడు.
దీంతో బ్రాహ్మణపల్లి గ్రామంలోని జనచైతన్య వెంచర్‌లో బుధవారం ఉదయం నిప్పంటించుకుని ఆత్మహ త్య చేసుకున్నాడు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో హయత్ నగర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. మృ తుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.