09-01-2026 07:53:56 PM
నస్పూర్,(విజయక్రాంతి): మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలోని నస్పూర్ లోని 30వ డివిజన్ యూత్ ఆధ్వర్యంలో పిఎస్ఆర్ క్రికెట్ టోర్నమెంట్ ను శుక్రవారం నస్పూర్ ఎస్సై ప్రశాంత్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ యువత అన్ని రంగాల్లో రాణించాలని, చెడు మార్గాల్లో పయనించకుండా మంచి మార్గంలో పయనించాలన్నారు. స్నేహపూర్వక వాతావరణంలో క్రీడాకారులు అందరూ క్రీడల్లో రాణించాలన్నారు. ఈ టోర్నీలో మొత్తం 38 టైమ్స్ తలపడుతున్నాయని టోర్నీ నిర్వాహకులు సాగర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో సహ నిర్వాహకులు హరీష్, భాను క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.