08-01-2026 12:04:43 AM
చిట్యాల, జనవరి 7(విజయ క్రాంతి): విద్యార్థి దశ నుండే విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను ఏర్పరచుకొని వాటిని సాధించే దిశగా పట్టుదలతో కృషి చేయాలని ఇంపాక్ట్ ఫౌండేషన్ రీజనల్ డైరెక్టర్ గూడూరు అంజిరెడ్డి అన్నారు. బుధవారం చిట్యాల పట్టణ కేంద్రంలోని లయోలా టెక్నో హై స్కూల్ లో నిర్వహించిన మోటివేషనల్ కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడారు. విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను పెట్టుకున్నప్పుడే వాటిని సాధించేందుకు క్రమశిక్షణతో పట్టుదలతో కృషి చేసేందుకు అవకాశం ఉంటుందన్నారు.
ప్రతి విద్యార్థి తల్లిదండ్రులను గురువులను గౌరవించడంతోపాటు దేశభక్తిని కలిగి ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో రీజనల్ మోటివేషనల్ స్పీకర్ నందికొండ రవీందర్ రెడ్డి పాఠశాల చైర్మన్ ఎన్.ఎఫ్ సుందర్ రాజ్, రీజనల్ ప్రెసిడెంట్ కోట్ల సాయికిరణ్, పాఠశాల డైరెక్టర్ తీగల కిరణ్, మూర్తల వెంకన్న, బెల్లం శ్రవణ్‌కుమార్ పాల్గొన్నారు.