09-01-2026 07:50:51 PM
ఆర్మూర్,(విజయక్రాంతి): ఆర్మూర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి కృషితోనే అబ్బివృద్ధి పనులు జరుగుతున్నాయని బిజెపి జిల్లా కార్యదర్శి పోల్కం వేణు అన్నారు. శుక్రవారం ఆర్మూర్ లో జరుగుతున్న టియుఎఫ్ఐడిసి జరుగు అభివృద్ధి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఆర్మూర్ పట్టణంలో 36 వార్డులలో నూతనంగా నిర్మించే డ్రైనేజీలు, కల్వట్లు, బీటి రోడ్లు ఎమ్మెల్యే ప్రత్యేక దృష్టి పెట్టి వీటిని మంజూరు చేయించడం జరిగిందన్నారు.
నియోజకవర్గంలోని నందిపేట్, మా క్లూర్, ఆలూరు, డొంకేశ్వర్, ఆర్మూర్ మండలాల్లో బీటి రోడ్లు, కల్వర్టులు, సబ్ స్టేషన్స్, హాస్టల్స్ బిల్డింగ్స్ తదితర 550 కోట్ల నిధులతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని అన్నారు. ఇప్పటివరకు 12 కోట్ల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ కింద ఎమ్మెల్యే పంపిణీ చేయడం జరిగిందని పేర్కొన్నారు. ఆర్మూర్ అసెంబ్లీలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయంటే కేవలం ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ఆదేశాల మేరకెనని అన్నారు. పనులు జరిగేటప్పుడు కాంగ్రెస్ నాయకులు వచ్చి ఫోటోలు దిగి పోజులు ఇస్తూ దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని వాపోయారు. ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో 16వ వార్డు బూత్ సెక్రెటరీ దోండి ఈశ్వర్, రాంనగర్ కాలనీవాసులు, బిజెపి కార్యకర్తలు పాల్గొన్నారు.