08-01-2026 12:03:29 AM
మిర్యాలగూడ, జనవరి 7 (విజయక్రాంతి): మిర్యాలగూడ పట్టణ పరిధిలోని 27 వార్డు కాంగ్రెస్ ఇంచార్జ్ రేబెల్లి లోహిత్ బుధవారం కాంగ్రెస్ పార్టీ కి రాజీనామ చేసి బీ ఆర్ ఎస్ లో చేరారు. ఈ సందర్బంగా బీ ఆర్ ఎస్ రాష్ట్ర నాయకులు నల్లమోతు సిద్దార్ద గులాబీ జెండాలు కప్పి పార్టీ లోకి ఆహ్వానించారు. రోహిత్ వెంట సుమారు 200 మందితో కలిసి పార్టీలోకి చేరారు. కాంగ్రెస్ వైఫల్యాలను ఎండ గట్టి బీ ఆర్ ఎస్ పార్టీని బలోపేతం చేశారు.
కార్యక్రమంలో నాయకులు ఎడవెల్లి శ్రీనివాస రెడ్డి, అన్నబీమోజు నాగార్జున చారి, ఎండి.ఇలియాస్ ఖాన్, పెద్ది శ్రీనివాస్ గౌడ్, పద్మశెట్టి కోటేశ్వర రావు, పిన్నబోయిన శ్రీనివాస్ యాదవ్, లింగంపల్లి చీరంజీవి, ఎండి.షోయబ్,పునాటి లక్ష్మీనారాయణ, కోల రామస్వామి, కంచి సత్యనారాయణ, యర్రమళ్ళ దినేష్, గంగుల బిక్షం యాదవ్, రాష్ట్ర యువజన నాయకులు తుమ్మల ఫణి కుమార్ తదితరులు ఉన్నారు.