calender_icon.png 10 January, 2026 | 9:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వృద్దుల డే కేర్ సెంటర్‌లో అన్ని వసతులు కల్పించాలి

09-01-2026 07:39:30 PM

దినపత్రికలు, మ్యాగ్జీన్స్ పెట్టాలి

ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్

సిరిసిల్లలోని వృద్దుల డే కేర్ సెంటర్ పనుల పరిశీలన

రాజన్న సిరిసిల్ల,(విజయక్రాంతి): వృద్దుల డే కేర్ సెంటర్ లో అన్ని వసతులు కల్పించాలని జిల్లా సంక్షేమ అధికారిని ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. సిరిసిల్ల పట్టణంలోని సుభాష్ నగర్ లో  వృద్దుల డే కేర్ సెంటర్ ను త్వరలో ప్రారంభించనుండగా, ఇంచార్జి కలెక్టర్ శుక్రవారం పరిశీలించారు. వృద్దుల డే కేర్ సెంటర్ ను త్వరలో ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేయాలని సూచించారు. వృద్దులకు ఏర్పాటు చేసిన క్యారం బోర్డ్స్, చెస్ ఇతర ఆట వస్తువులు పరిశీలించారు.

ఇక్కడ ఎందరు వృద్దులు సేద తీరవచ్చని ఆరా తీశారు. వృద్దుల డే కేర్ సెంటర్ లో దినపత్రికలు, వార పత్రికలు, మాస పత్రికలు, కథల పుస్తకాలు అందుబాటులో పెట్టాలని, టీ, స్నాక్స్ అందించేందుకు వంట పాత్రలు, కప్పులు సిద్ధంగా పెట్టాలని సూచించారు. ఫ్లోరింగ్ పై మంచి మ్యాట్ వేయించాలని, ఇతర సామగ్రి తీసుకోవాలని, ఫిజియో థెరపి, పాలియేటీవ్ సేవలు అందుబాటులో పెట్టాలని ఆదేశించారు. పరిశీలనలో జిల్లా సంక్షేమ అధికారి లక్ష్మీరాజం, తహసిల్దార్ మహేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.