calender_icon.png 10 January, 2026 | 9:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీఆర్ఎస్ సర్పంచుల ఆత్మీయ సమ్మేళనం

09-01-2026 07:32:01 PM

నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లా కేంద్రంలో ఇటీవలే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బి ఆర్ఎస్ పార్టీ మద్దతుతో గెలిచిన సర్పంచ్లకు ఉపసర్పంచ్ లకు వార్డు సభ్యుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఆ పార్టీ జిల్లా సమన్వయకర్త పి.రామ్ కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో సన్మానం చేసి పూల బొకేలను అందించారు. వచ్చే మున్సిపల్, ఎంపీటీసీ, జడ్పిటిసి ఎన్నికల్లో టిఆర్ఎస్ గెలిపించుకునేందుకు కష్టపడి పని చేద్దామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు భూషణ్ రెడ్డి, మార్గొండ రాము, తదితరులు పాల్గొన్నారు.