calender_icon.png 8 October, 2025 | 7:25 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శోభాయమానంగా శ్రీ వాల్మీకి పవిత్రజలాల శోభయాత్ర

08-10-2025 12:29:16 AM

వాల్మీకి మహర్షి విగ్రహానికి జలాభిషేకం 

చిన్నచింతకుంట, అక్టోబర్ 7 : రామాయణం మహాకావ్య రచయిత వాల్మీకి మహర్షి జయంతి ఉత్సవాలు మండల కేంద్రంలోని వాల్మీకి దేవాలయంలో అత్యంత వైభవంగా నిర్వహించారు. సోమవారం గణపతి పూజ, పుణ్య వాచకం, అఖండ భజనలు నిర్వహించారు. మంగళవారం ఆత్మ కూరు మండలంలోని జూరాల గ్రామం వద్ద పవిత్ర కృష్ణ జలాలకు ప్రత్యక్ష పూజలు నిర్వహించి, ప్రత్యేక వాహనంలో పవిత్ర జలాలను గ్రామ సమీపంలోకి తీసుకొచ్చారు.

ఈ సంద ర్భంగా వాల్మీకి బోయ కులస్తులు మహిళలు బ్యాండ్ మేళాల మంగళ హారతులతో పవిత్ర జలాలను స్వాగతం పలికి పురవీధుల గుండా శోభాయాత్ర శోభాయ మానంగా జరిగింది. వాల్మీకి కులస్తు లు అడుగడుగునా అడుగుల భజనలు, బొడ్డెమ్మలు, యువతి,యువకుల కోలాటాలతో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. పవిత్ర జలాలను వాల్మీకి దేవాలయం వద్దకు చేర్చి వాల్మీకి మహర్షి విగ్రహానికి అర్చకులు పంచామృత, జలాభిషేకం నిర్వహించి, అలంకరించి పూజలు ని ర్వహించారు. అనంతరం భక్తులకు అన్నదానం చేశారు. కార్యక్రమంలో వాల్మీకి సేవా సం ఘం, యువజన సంఘం సభ్యులు, పెద్ద ఎత్తున మహిళలు యువకులు పాల్గొన్నారు.