08-10-2025 12:30:30 AM
కౌకుంట్ల అక్టోబర్ 7 : మండలంలోని వెంకంపల్లి ,వెంకటగిరి ,కౌకుంట్ల గ్రామాలకు వెళ్లే రోడ్డు పూర్తిగా చిత్తడిగా మారింది. చినుకు పడితే చాలు చిత్తడిగా మా రుతున్నది. దీంతో వాహన చోదకులు నిత్యం దేవరకద్ర ఆత్మకూర్ తదితర ప్రాంతాలకు వెళ్లాలన్న అంతా బురదగుంటలోనే ప్ర యాణం కొనసాగించాల్సిన పరిస్థితి ఏర్ప డింది. రాత్రి వేళల్లో ముఖ్యంగా చీకటి ఉండడంతో కొంతమంది వాహన చోదకులు అదుపుతప్పి ఆ బురద గుం తలలో కిందపడి గాయాలపాలు అవుతున్నామని వా హన చదువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రైల్వే లైన్ పక్కన కొద్ది దూరం మట్టి రోడ్డు వేయడంతో ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు మట్టి రోడ్డు కాస్త బురదమయంగా, చిత్తడి, చిత్తరగా మారుతున్నది .దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ఈ రోడ్డుకు వెంటనే మరమ్మతులు చేపట్టాలంటే మాపోతున్నారు. మరో 20 రోజుల్లో కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కావస్తున్నాయి. వాహనాల రద్దీ పెరుగుతుంది. వెంకటగిరి వెంకంపల్లి ప్రజలు ఆ రోడ్డు మరమ్మతులు చేపట్టాలని లేకపోతే అది ప్రమాదమే అవకాశం ఉందని గ్రామస్తులు కోరుతున్నారు.