calender_icon.png 9 January, 2026 | 3:12 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మద్యం కోసం గోపురం ఎక్కిన వ్యక్తి

04-01-2026 12:37:01 AM

  1. తిరుపతిలో మూడు గంటలపాటు హైడ్రామా

సురక్షితంగా కిందకు దించిన పోలీసులు

తిరుపతి, జనవరి 3 (విజయక్రాంతి): మద్యం మత్తులో ఉన్న ఓ వ్యక్తి శనివారం తెల్లవారుజామున భద్రతా సిబ్బంది కళ్లుగప్పి తిరుపతిలోని చారిత్రక గోవిందరా జ స్వామి ఆలయం లోపలికి వెళ్లాడు. నడిమి గోపురం పైకి ఎక్కి నానా హంగామా సృష్టించాడు. గమనించిన భక్తులు, విజిలెన్స్ సిబ్బంది ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యా రు. ఆ వ్యక్తి దాదాపు వంద అడుగుల ఎత్తు లో ఉన్న గోపురంపై కూర్చుని హల్‌చల్ చేశాడు. తనకు తాగడానికి క్వార్టర్ మద్యం, బాటిల్ ఇస్తేనే కిందకు వస్తానని భీష్మించుకుని కూర్చున్నాడు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది తక్షణమే అక్కడికి చేరుకున్నారు.

మూడు గంటల పాటు సాగిన ఈ హైడ్రా మా.. నిందితుడు కోరినట్లు మద్యం ఇస్తామని పోలీసులు నమ్మించడంతో చివరకు సుఖాంతమైంది. అగ్నిమాపక సిబ్బంది అతడిని సురక్షితంగా కిం దకు దించారు. గోపురం ఎక్కిన వ్యక్తిని తెలంగాణలోని నిజామాబాద్ జిల్లాకు చెందిన కుత్తాడి తిరుపతిగా పోలీసులు గుర్తించారు. అతడిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించి, కేసు నమోదు చేశారు.  ఘటనపై ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు.