calender_icon.png 9 January, 2026 | 8:33 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బంగ్లాదేశ్‌లో మరో విషాదం

04-01-2026 12:41:13 AM

  1. ఆందోళనకారుల చేతిలో దాడికి గురైన మరో హిందువు మృతి

౨ వారాల్లో నాలుగుకు చేరిన మృతుల సంఖ్య

ఢాకా, జనవరి 3: బంగ్లాదేశ్‌లో హిందూ మైనారిటీలపై జరుగుతున్న దాడులు మరో ప్రాణాన్ని బలితీసుకున్నాయి. ఇటీవల షరియత్‌పూర్ జిల్లాలో దుండగుల దాడికి గురై న వ్యాపారి ఖోకోన్ చంద్రదాస్ తీవ్రగాయాలపాలై ఢాకాలోని నేషనల్ బర్న్ ఇనిస్టి ట్యూట్ ఆస్పత్రిలో చికిత్సపొందుతూ శనివా రం ఉదయం కన్నుమూశాడు. గత బుధవారం రాత్రి దుకాణం మూసివేసి ఇంటికి వెళ్తున్న సమయంలో ఖోకోన్ చంద్రదాస్‌ను కొందరు అడ్డుకుని ఆయుధాలతో దాడి చేశారు. పెట్రోల్ పోసి నిప్పుపెట్టారు. దీంతో చంద్రదాస్ ప్రాణాలను కాపాడుకునేంపద కు సమీపంలోని చెరువులో దూకాడు.

స్థానికులు ఆయన్ను కాపాడి చికిత్స కోసం ఆసు పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొం దుతూ చంద్రదాస్ మృతిచెందాడు. తమకు ఎవరితోనూ ఎలాంటి శత్రుత్వం లేకపోయి నా ఇలాంటి పరిస్థితి ఎందుకు ఎదురైందో తెలియదని మృతుడి భార్య సీమా దాస్ కన్నీరుమున్నీరుగా విలపించింది. తాజా ఘటన తో ఆందోళనకారులు ఇప్పటివరకు నలుగురు హిందువులను పొట్టనపెట్టు కున్నట్ల యింది. గతంలో దీపూ చంద్రదాస్, బజేంద్ర బిశ్వాస్, అశోక్‌సామ్రాట్ మృతిచెందిన విష యం తెలిసిందే.