22-12-2025 12:01:55 AM
సిద్దిపేట క్రైం, డిసెంబర్ 21 : సిద్దిపేట పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో నిర్వహించిన తనిఖీల్లో 24 మంది మద్యం తాగి వాహనాలు నడుపుతూ పట్టుబడ్డారని సిద్దిపేట ట్రాఫిక్ సీఐ కె. ప్రవీణ్ కుమార్ తెలిపారు. ఆదివారం వారిని సిద్దిపేట స్పెషల్ సెకండ్ క్లాస్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ కాంతారావు ఎదుట హాజరుపరచగా, రూ. లక్షా 88 వేల జరిమానా విధించారని చెప్పారు. మద్యం తాగి వాహనాలు నడపవద్దని, డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడితే పదివేల రూపాయల జరిమానా చెల్లించాలని సీఐ సూచించారు.