calender_icon.png 18 December, 2025 | 4:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తెలంగాణ యూనివర్సిటీ మ్యాజిక్ బస్ ఇండియా ఫౌండేషన్ మధ్య అవగాహన ఒప్పందం

18-12-2025 02:00:04 AM

డిచ్ పల్లి, డిసెంబర్  17 (విజయ క్రాంతి): తెలంగాణ యూనివర్సిటీ మ్యాజిక్ బస్ ఇండియా ఫౌండేషన్ మధ్య 17 డిసెంబర్ 2025న అవగాహన ఒప్పందం (ఎంఓయూ) కుదిరింది. ఈ ఎంఓయూపై తెలంగాణ విశ్వవిద్యాలయ వైస్ ఛాన్స్లర్ ఆచార్య టి యాదగిరిరావు, రిజిస్ట్రార్ ఆచార్య ఎం యాదగిరి  సంతకాలు చేశారు. ఇది విశ్వవిద్యాలయ విద్యార్థుల్లో నైపుణ్యాభివృద్ధి అలాగే ఉపాధి అవకాశాలను పెంపొందించే దిశగా ఒక ముఖ్యమైన ముందడుగు.

కంపెనీస్ యాక్ట్, 1956 (సెక్షన్ 25) కింద నమోదు అయిన లాభాపేక్షలేని సంస్థ అయిన మ్యాజిక్ బస్ ఇండియా ఫౌండేషన్, తన ఎన్జీఓ భాగస్వామ్య కేంద్రాల ద్వారా తెలంగాణ యూనివర్సిటీ విద్యార్థులకు ఉద్యోగోన్నతి లక్ష్యంగా నైపుణ్యాభివృద్ధి శిక్షణ కోర్సులను అందించనుంది. ఈ ఒప్పందం 17 డిసెంబర్ 2025 నుండి 16 డిసెంబర్ 2026 వరకు 12 నెలల పాటు చెల్లుబాటు అవుతుంది. ఇరు పక్షాల పరస్పర అంగీకారంతో ఈ కాలాన్ని పొడిగించవచ్చు.

ఈ ఎంఓయూ ప్రకారం, మ్యాజిక్ బస్ ఇండియా ఫౌండేషన్ అర్హత ప్రమాణాల ఆధారంగా విద్యార్థులను ఎంపిక చేసి, ఆమోదించిన కోర్సుల ప్రకారం శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తుంది. అలాగే కెరీర్ మార్గదర్శక ఉపన్యాసాలు, చేంజ్ మేకర్ సెషన్లు నిర్వహించి, కోర్సును విజయవంతంగా పూర్తి చేసిన విద్యార్థులకు సర్టిఫికెట్లు జారీ చేస్తుంది. విద్యార్థుల భవిష్యత్ వృత్తి అవకాశాలను బలోపేతం చేయడానికి ప్లేస్మెంట్ ఆధారిత శిక్షణ, ప్లేస్మెంట్ డ్రైవ్స్ నిర్వహించి, అర్హులైన విద్యార్థులకు ప్లేస్మెంట్ సహాయం కూడా అందిస్తుంది.

తెలంగాణ వర్సిటీ వైస్ ఛాన్స్లర్ ఆచార్య పి యాదగిరి రావు తెలిపారు. మ్యాజిక్ బస్ ఇండియా ఫౌండేషన్ లక్ష్యాలు , మార్గదర్శకాల ప్రకారం అర్హులైన విద్యార్థుల వివరాలను పంచడం ద్వారా, అలాగే శిక్షణ కార్యక్రమాల నిర్వహ ణకు అవసరమైన మౌలిక వసతులు మరియు సౌకర్యాలు కల్పించడం ద్వారా తెలంగాణ యూనివర్సిటీ ఈ కార్యక్రమానికి మద్దతు అందిస్తుంది.

ఈ ఎంఓయూ కార్యక్రమం మరియు సమావేశంలో తెలంగాణ యూనివర్సిటీ నుండి గౌరవ ఉపకులపతి ప్రొఫెసర్ టి. యాదగిరి రావు, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఎం. యాదగిరి, ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం. ప్రవీణ్, ప్లేస్మెంట్ మరియు ట్రైనింగ్ సెల్ డైరెక్టర్ డాక్టర్ పాఠ నాగరాజు పాల్గొన్నారు. మ్యాజిక్ బస్ ఇండియా ఫౌండేషన్ తరఫున డీజీఎం (లైవ్లీహుడ్ ఆపరేషన్స్  తెలంగాణ & ఆంధ్రప్రదేశ్) శ్రీ డి. శేఖర్ బాబు, ప్రోగ్రామ్ మేనేజర్ శ్రీ ఎం. సృజన్ దా, ప్రొఫైలింగ్ ఆఫీసర్ శ్రీ డి. బాల మురళి కృష్ణ ఈ సమావేశంలో పాల్గొన్నారు. విద్య మరియు ఉపాధి మధ్య ఉన్న అంతరాన్ని తగ్గించి, పరిశ్రమలకు అనుగుణమైన నైపుణ్యాలతో విద్యార్థులను సిద్ధం చేయాలనే తెలంగాణ యూనివర్సిటీ సంకల్పాన్ని ఈ సహకారం ప్రతిబింబిస్తోంది.