18-12-2025 02:01:08 AM
సూర్యాపేట, డిసెంబర్ 16 (విజయక్రాంతి): సూర్యాపేట జిల్లాలోని నేరేడుచర్ల మం డలం కందులవా రిగూడెం గ్రామ సర్పంచిగా ఊటుకూరి మాధవరెడ్డి ఒక్క ఓటు మెజారిటీతో గెలుపొందారు. స్వతంత్ర అభ్యర్థిగా పోటీలోకి దిగిన మాధవరెడ్డికి 397 ఓట్లు రాగా, సమీ ప ప్రత్యర్థి కందుకూరి సత్యనారాయణరెడ్డి 396 ఓట్లు వచ్చాయి. దీంతో మాధవరెడ్డి ఒక్క ఓటు మెజారిటీతో గెలుపొందినట్టు అధికారులు ప్రకటించారు.