calender_icon.png 20 November, 2025 | 2:14 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉన్నత విద్యా రంగానికి మైలురాయి

20-11-2025 12:00:00 AM

టీసీఎస్ ఐవోఎన్‌తో జయప్రకాశ్ నారాయణ ఇంజనీరింగ్ కళాశాల ఎంవోయూ

మంత్రి శ్రీధర్‌బాబు

హైదరాబాద్, నవంబర్ 19 (విజయక్రాంతి): రాష్ట్రంలో ఉన్నత విద్యా రంగానికి మరో మైలురాయిగా, యూజీసీ ఆటానమస్ సంస్థ అయిన జయప్రకాశ్ నారాయణ ఇంజనీరింగ్ కళాశాల (జేపీఎస్‌సీఈ), ప్రతిష్ఠాత్మకమైన టీసీఎస్ ఐవోఎన్‌తో ఉద్యోగాల కల్పన (జాబ్ అచీవర్) కోసం అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకుంది. ఈ ఒప్పందాన్ని ఐటీ శాఖ మంత్రి శ్రీధర్‌బాబు సమక్షంలో జరిగింది.

విద్యార్థుల విద్యా ప్రావీణ్యాన్ని పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దడంలో ఈ భాగస్వా మ్యం కీలక పాత్ర పోషించనుంది. జేపీఎన్సిఈ తెలంగాణలో మొదటి ప్రైవేట్ కళాశా లగా ఈ కార్యక్రమంతో ఎంవోరయూ కుదుర్చుకోవడం విశేషం.

‘జాబ్ అచీవర్’ కార్యక్ర మం విద్యార్థులకు ఐటీ, ఇంజనీరింగ్ మరి యు ఇతర సాంకేతిక రంగాల్లో వృత్తి పరం గా రాణించేందుకు అవసరమైన నైపుణ్యాలు, జ్ఞానం అందించడానికి రూపుదిద్దు కుంది. మంత్రి మాట్లాడుతూ.. విద్యార్థులు ప్రస్తుత ఉద్యోగ రంగం అవసరాలకు అనుగుణంగా నైపుణ్యాలు సంపాదించేందుకు జేపీఎన్‌సీఈ చేపట్టిన ఈ ముందడుగును అభినందించారు. ఇటువంటి భాగస్వామ్యాలు తెలంగాణను నైపుణ్యవంతుల రాష్ట్రంగా మార్చడంలో కీలకం అని ఆయన తెలిపారు.