20-11-2025 12:00:00 AM
చేవెళ్ల, విజయక్రాంతి: రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో 100 పడకల ఆసుపత్రి నిర్మాణం చెప్పట్టాలని రిలేనిరాహార దీక్షకు పిలుపు నిచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో అన్ని అసెంబ్లీలలో 100 పడకల హాస్పిటల్ పూర్తయింది, కానీ కేవలం రంగారెడ్డి జిల్లా చేవెళ్ల అసెంబ్లీలో మాత్రమే రెండు సంవత్సరాల క్రితం రూ. 17 కోట్ల 50 లక్షలు మంజూరు చేశారు.
కానీ ఇప్పటివరకు పని ప్రారంభం కాలేదని,ఈ పనిని వెంటనే ప్రారంభించాలని చేవెళ్ల భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో బస్టాండ్ ముందు రిలే నిరాహారదీక్ష నిర్వహించడం జరుగుతుందని వివరించారు. సమయం ఉదయం 9:30 నుండి సాయంత్రం 5 గంటల వరకి రిలే నిరాహార దీక్ష నిర్వహించడం జరుగుతుందని బీజేపీ శ్రేణులు వెల్లడించారు. అయితే రెండు రోజుల క్రితం విజయ క్రాంతి దినపత్రికలో పునాదిరాయి పడలే.. పురిటి నొప్పులు తీరలే.. శీర్షికతో ప్రచురించిన కథనానికి బిజెపి పార్టీ రిలే నిరాహార దీక్షకు పిలుపునిచ్చింది