29-09-2025 12:14:25 AM
ములుగు, సెప్టెంబరు 28 (విజయక్రాంతి): యూనివర్సిటీ ఏర్పాటు ద్వారా స్థానిక యువతకు ఉన్నత విద్యా అవకాశాలు అందుతాయని, విద్యా రంగంలో కొత్త అధ్యాయం సమ్మక్క సారలమ్మ సెంట్రల్ యూనివర్సిటీ సృష్టిస్తుందని రాష్ట్ర పంచాయతీ రాజ్,గ్రామీణ అభివృద్ధి,గ్రామీణ నీటి సరఫరా,మహిళా,శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క అన్నారు.
ఆదివారం జిల్లా కేంద్రంలో జాతీయ రహదారి ప్రక్కనే ఉన్న సాయిబాబా టెంపుల్ రోడ్ వద్ద సమ్మక్క సారలమ్మ సెంట్రల్ ట్రైబల్ విశ్వవిద్యాలయం కోసం 24 కోట్ల నిధులతో 8.4 కిలోమీటర్ల సమ్మేళనం గోడ నిర్మాణ పనులను శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ సమ్మక్క- సారలమ్మ ట్రైబల్ యూనివర్సిటీ ఏర్పాటుతో ములుగు జిల్లాకు ప్రత్యేక గౌరవ లభిస్తుందని,
గిరిజన విద్యార్థుల ప్రతిభను వెలికితీయడానికి ఇది బలమైన వేదిక అవుతుందని తెలిపారు. ప్రభుత్వం ఎల్లప్పుడూ గిరిజన సంక్షేమం పట్ల కట్టుబడి ఉందని యూనివర్సిటీ అభివృద్ధికి అవసరమైన నిధులు, మౌలిక వసతులను సమకూర్చుతామని పేర్కొన్నారు. యూనివర్సిటీ ఏర్పాటు ద్వారా స్థానిక యువతకు ఉన్నత విద్యా అవకాశాలు అందుతాయని, విద్యారంగంలో కొత్త అధ్యాయం సమ్మక్క సారలమ్మ సెంట్రల్ యూనివర్సిటీ సృష్టిస్తుందని పేర్కొన్నారు.
విద్యార్థుల కోసం ఆధునిక లైబ్రరీలు, ల్యాబరేటరీలు, హాస్టల్స్, తరగతి గదులు ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. స్థానిక విద్యార్థులు ఉన్నత విద్య కోసం దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేదన్నారు. యూనివర్సిటీ ఏర్పాటు వల్ల విద్యా రంగం, జిల్లా అభివృద్ధికి సహకారం ఏర్పడుతుందని విద్యార్థులు, యువత, స్థానికులు అందరూ ఈ యూనివర్సిటీ ద్వారా అద్భుత ఫలితాలను రాణిస్తార న్నారు.
ప్రజా ప్రభుత్వం గిరిజన సంక్షేమం, విద్యా అవకాశాలను ఎల్లప్పుడూ ప్రాధాన్యత ఇస్తుందని, యూనివర్సిటీ ఏర్పాటు ములు గు జిల్లాకు గౌరవాన్ని కలిగించడమే కాక, విద్యా రంగంలో కొత్త మైలురాయిని సృష్టిస్తుందన్నారు. ఈ సందర్భంగా మహబూబా బాద్ పార్లమెంట్ సభ్యులు పోరిక బలరాం నాయక్ మాట్లాడుతూ.. కొత్తగా ఏర్పాటు కాబోతున్న సమ్మక్క-సారలమ్మ ట్రైబల్ యూనివర్సిటీలో 80 శాతం స్థానిక విద్యార్థులకు ప్రవేశ అవకాశాలు కల్పించడం జరుగుతుందని యూనివర్సిటీ ఏర్పాటు ద్వారా ప్రాంతీయ ప్రతిభను వెలికి తీయడానికి ముఖ్యమైన వేదికగా మారుతుందని తెలిపారు.
స్థానిక విద్యార్థులు ఉన్నత విద్య కోసం దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేదని గిరిజన యూనివర్సిటీ అన్ని అవకాశాలు అందుబాటులో వస్తాయని అన్నారు. అన్ని హంగులతో ఆధునిక లైబ్రరీలు, ల్యాబరేటరీలు, హాస్టల్స్, తరగతి గదులు ఏర్పాటుచేసి విద్యార్థులకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడం జరుగుతుందని పేర్కొన్నారు.
సమ్మక్క-సారలమ్మ ట్రైబల్ యూనివర్సిటీ ద్వారా, యువత సుస్థిరమైన భవిష్యత్తుకు పునాది వేసినట్లు అవుతుందని సమాజానికి, జిల్లా అభివృద్ధికి, మరియు గిరిజన సంక్షేమానికి అభివృద్ధిలో మార్గదర్శిగా నిలుస్తుందని అన్నారు.
ఈ సందర్భం గా ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యులు జి నాగేష్ మాట్లాడుతూ 24కోట్ల రూపాయలతో ప్రహరీ గోడ నిర్మాణానికి భూమి పూజ చేయడం జరిగిందని, కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాంతంలోని గిరిజనుల విద్యాభివృద్ధి కోసం వారి సంస్కృతి సాంప్రదాయాలను ప్రపంచానికి తెలియజేసేలా, ఆర్థిక అభివృద్ధిలో కూడా యూనివర్సిటీ ముఖ్యపాత్ర పోషిస్తుందన్నారు. త్వరలోనే క్యాంపస్ నిర్మాణం విద్యార్థులకు మౌలిక సదుపాయాలు ఏర్పాటు జరుగుతుందన్నారు.