calender_icon.png 29 September, 2025 | 7:10 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవాలి

29-09-2025 12:13:53 AM

-మెడికవర్ హాస్పటల్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శరత్‌రెడ్డి

-వరల్డ్ హార్ట్‌డే సందర్భంగా బైక్ ర్యాలీ నిర్వహణ

-కార్యక్రమాన్ని ప్రారంభించిన మాదాపూర్ ఏసీపీ చంద్రశేఖర్‌రెడ్డి

హైదరాబాద్ సిటీ బ్యూరో, సెప్టెంబర్ 28: ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం జరుపుకునే వరల్ హార్ట్ డే సందర్భంగా, మెడికవర్ హాస్పిటల్ హైటెక్ సిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక బైక్ ర్యాలీ నిర్వహించారు.ఈ ర్యాలీ మెడికవర్ హాస్పిటల్ హైటెక్ సిటీ నుంచి ప్రారంభమై నీయోపోలిస్ కోకాపేట వరకు కొనసాగింది.కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాదాపూర్ డివిజన్ ఏసీపీ ట్రాఫి క్ కె. చంద్రశేఖర్ రెడ్డి హాజరై ర్యాలీని ప్రారంభించారు.

ఈ సందర్భంగా మెడికవర్ హాస్పి టల్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ శరత్ రెడ్డి మాట్లాడుతూ గుండె జబ్బులు నేటి సమాజంలో వేగంగా పెరుగుతున్నాయని, క్రమం తప్పని వ్యాయామం, సమతుల ఆహారం, ఆరోగ్య పరీక్షల ద్వారా గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవాలన్నారు. ప్రజల్లో గుండె సంబంధిత వ్యాధులపై అవగాహన పెంచడమే ఈ బైక్ ర్యాలీ ముఖ్య ఉద్దేశ్యం అని తెలిపారు. కాగా వరల్ హార్ట్ డే సందర్భంగా ప్రజల కోసం మెడికవర్ హాస్పిటల్స్ ప్రత్యేకంగా రూ.999 హెల్త్ చెకప్ ప్యాకెజ్‌ని ప్రకటించిం ది.    ప్రకటించింది. 

ఈ ప్యాకేజీలో ఈసీజీ, 2డి ఈసీహెచ్‌ఓ, టీఎంటీ, లిపిడ్ ప్రొఫైల్, క్రియేటినైన్, ఆర్‌బీఎస్ (రాండమ్ బ్లడ్ షుగర్) మరియు కార్డియాలజిస్ట్ కన్సల్టేషన్ వంటి సేవలు ఉంటాయి. కార్యక్రమంలో మెడికవర్ హాస్పిటల్స్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ మహేష్ డెగ్లూర్కర్ మరియు సెంటర్ హెడ్ శ్రీకాంత్ పాల్గొన్నారు.