calender_icon.png 29 September, 2025 | 6:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డ్రగ్స్, బెట్టింగ్ రహిత సమాజం కోసం అవగాహన కార్యక్రమాలు

29-09-2025 12:15:25 AM

-అక్టోబర్ 12న రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో నిర్వహణ

-‘పర్యావరణ పరిరక్షణ సమితి’ సంస్థ చైర్మన్ నరేష్ దండు 

హైదరాబాద్ సిటీ బ్యూరో, సెప్టెంబర్ 28 (విజయక్రాంతి): ‘పర్యావరణ పరిరక్షణ సమి తి చెట్టు అమ్మ అనే స్వచ్ఛంద సంస్థ’ డ్రగ్స్ రహిత, బెట్టింగ్ రహిత సమాజ నిర్మాణం కోసం రాష్ట్రవ్యాప్తంగా కాలేజీలు, హాస్టల్స్ మరియు విద్యార్థులు ఎక్కువగా ఉన్న ప్రాం తాల్లో 2కే రన్ అవగాహన కార్యక్రమాలను నిర్వహిసోదని సంస్థ చైర్మన్ నరేష దండు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.సమాజం శ్రేష్టంగా మారేందుకు ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా సహకరించాలని కోరా రు.

అక్టోబర్ 12తేదీన ఉదయం 7.30 గంటలకు రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోని దర్గ ప్రాంతంలో ఉన్న బిడియల్ రోడ్డు నుం చి 2కే రన్ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. ఈ సంద ర్భంగా, ప్రతి ఒక్కరినీ పార్టీలకు, వర్గాలకు, కులాలకు అతీతంగా అందరిని ఆహ్వానిస్తూ,  ఈ కార్యక్రమంలో ప్రముఖ రాజకీయ నాయకులు, వర్తక వ్యాపారులు, సినీనటులు, సెల బ్రిటీలు, సింగర్స్, కళాకారులు, మీడియా మిత్రులు పాల్గొనబోతున్నారు. ఈ వేడుకకు పెద్ద సంఖ్యలో విద్యార్థులు కూడ పాల్గొననున్నట్లు చెప్పారు.కార్యక్రమానికి హాజరు కావా లనుకునే వారు వనరుల సౌకర్యాల కోసం ముందస్తుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కోరారు.