calender_icon.png 6 November, 2025 | 3:44 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రతి యువకుడి కథతో కొత్త సినిమా

06-11-2025 01:15:59 AM

శ్రీవిష్ణు మరో కొత్త సినిమాతో రాబోతున్నారు. ఆయన హీరోగా సన్నీ సంజయ్ రచనాదర్శకత్వంలో ఈ చిత్రం రూపుదిద్దుకోనుంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై నాగ వంశీ, సాయిసౌజన్య నిర్మిస్తున్నారు. ‘ది స్టోరీ ఆఫ్ ఎవ్రీ యంగ్‌స్టర్’ అనే ట్యాగ్‌లైన్‌తో ఆవిష్కరించిన అనౌన్స్‌మెంట్ పోస్టర్ ఆక ట్టుకుంటోంది.

శ్రీవిష్ణు పాత్ర గుర్తుండిపోయేలా ఉంటుందని, ‘అనగనగా’తో ఓటీటీలో అరంగే ట్రం చేసిన దర్శకుడు సన్నీ ఈ సినిమాతో వెండితెరకు పరిచయం కానున్నారు. సున్నితమైన భావోద్వేగాలతో నిండిన, రోజువారీ జీవితాన్ని నిర్వచించే నిశ్శబ్ద సంఘర్షణలు, ఆశలు, సంతృప్తిలను అన్వేషించే కథతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు. త్వరలోనే చిత్రీకరణ ప్రారంభించుకోనుందీ సినిమా.