calender_icon.png 17 November, 2025 | 6:30 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజల కలలను సాకారం చేసిన ప్రజా ప్రభుత్వం

17-11-2025 12:28:49 AM

ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ 

రాజన్న సిరిసిల్ల, నవంబర్ 16 (విజయక్రాంతి): వేములవాడ నియోజకవర్గం కథలాపూర్ మండలం పోతారం గ్రామానికి చెందిన పెంటల బుజ్జమ్మ నూతన ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం పూర్తి చేసుకొని నేడు గృహ ప్రవేశం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై నూతన గృహ ప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్నారు.

పెంటల బుజ్జమ్మ మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సహకారంతో నేడు స్వంత ఇంటి కల సాకారం అయ్యిందని తెలిపారు..ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. హృదయపూర్వక ధన్యవాదాలుతెలిపారు.