calender_icon.png 17 November, 2025 | 2:35 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చెరువుల్లోకి చేపలు లేనట్టే

17-11-2025 12:00:00 AM

-టెండర్లకు ముందుకు రాని కాంట్రాక్టర్లు

-జగిత్యాల కాంట్రాక్టర్‌కు అప్పగించిన ఒప్పందం కరువే

-జిల్లాలో 13వేల మత్స్య కార్మికులకు ఉపాధికి గండి

నిర్మల్ నవంబర్ 16 (విజయక్రాంతి) : మత్స్య కార్మికులకు ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత చేప పిల్లల పంపిణీ జిల్లాలో మీనవేషాలు లెక్కిస్తుంది. నవంబర్ చివరి మోసానికి చేరుకున్న జిల్లాలో 100% సబ్సిడీ పిల్లల విడుదల ఇంకా ఒక కొలిక్కి రావడం లేదు.

అసలు ఈ సంవత్సరం చేప పిల్లలు విడుదల అసలు ఉంటుందా ఉండదా అని ప్రశ్న తలెత్తుతుంది. చేపల వృత్తి జీవనాధారంగా బతుకు తున్న 13500 కుటుంబాలకు జీవన భరో సా ప్రశ్నార్థకంగా మారుతుంది. నిర్మల్ జిల్లాలో 2025 26 సంవత్సరం 4.29 కోట్ల చేప పిల్లలను చెరువుల్లో ప్రాజెక్టులో విడుదల చేయాలని మత్స్య కార్మిక శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. నిర్మల్ జిల్లాలో 222 మత్స్య కార్మిక సంఘాలు ఉండగా ఇందులో 74 మహిళా మత్స్య కార్మిక పారిశ్రామిక సంఘా లు ఉన్నాయి.

మొత్తం 13 4 6 2 మంది మచ్చ కార్మికులు ఈ సంఘంలో ఉన్నారు. వీరంతా జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులైన శ్రీరాంసాగర్ గడ్డన్న శుద్ధ వాగు కడెం నారాయణరెడ్డి ప్రాజెక్టు స్వర్ణ ప్రాజెక్ట్ చీరాల తోపాటు 452 చెరువుల్లో చేప పిల్లలు పెంచాలని ప్రభుత్వ నిర్ణయం తీసుకుంది. ఇందుకుగాను 4.29 కోట్ల చేప పిల్లలను 100% సబ్సిడీపై చెరువుల్లో ప్రాజెక్టుల్లో విడుదల చేసే విధంగా ప్రణాళికలు రూపొందించుకుంది

ఆది నుంచి మీన మేషాలే..

నిర్మల్ జిల్లాలో ఉన్న సాగునీటి వనరులు ఈ సంవత్సరం భారీ వర్షాల కారణం గా నిండుకున్నాయి జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టు కడెం నారాయణరెడ్డి స్వర్ణ భైంసా గడ్డన్న శుద్ధ బాబు చీరాల ప్రాజెక్టు తోపాటు 452 కుంటల్లో చేప పిల్లలను విడుదల చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

ఇందు లో 60 నుంచి 80 , 100 గ్రాముల, గ్రాము ల చేప పిల్లలను విడుదల చేసేలా చర్యలు తీసుకున్నారు అయితే 2023 నుంచి జిల్లా లో సాగునీటి చెరువులో ప్రాజెక్టులో చేప పిల్లలు సరఫరా చేసే కాంట్రాక్టర్లకు బిల్లులు రాకపోవడంతో మూడుసార్లు టెండర్లు వేసిన వారు ఈ సంవత్సరం టెండర్లలో పాల్గొనలేదు. పాత బిల్లులను చెల్లిస్తేనే కొత్తగా టెండర్లలో పాల్గొంటామని హెచ్చరించారు.

దీనిపై ప్రభుత్వం వారితో సంప్ర దింపులు జరిపి బకాయిలో 20% బిల్లులు చెల్లిస్తామని వారికి హామీ ఇచ్చిన బిల్లులు రాకపోవడంతో జిల్లాలో చేప పిల్లలు సరఫరా చేసే కాంట్రాక్టర్లు ముందుగా వివరిస్తూ మూడుసార్లు టెండర్లు ప్రభుత్వం ఆహ్వానించిన వారు టెండర్లు వేయకపోవడంతో తీవ్ర జాప్యం జరిగింది. ప్రతి సంవత్సరం జూలై ఆగస్టు మాసాల్లో కురిసిన వర్షాలకు చెరువులు ప్రాజెక్టులు నిండుకోగానే ఆగస్టు మాసంలో టెండర్ల ప్రక్రియ పూర్తి అయ్యేది. అదే నెలలో చేప పిల్లలను వారికి కేటాయించిన చెరువులు నీటి ప్రాజెక్టులు విడుదల చేసేవారు. కానీ ఈ సంవత్సరం నవంబర్ ముగింపుకు వస్తున్న ఇప్పటికీ టెండర్ల ప్రక్రియ ఖరారు కాలేదు.

దీంతో అధికారులు చేసేదేమీ లేక పక్క జిల్లా అయినా జగిత్యాల జిల్లా కాంట్రాక్టర్కు చేప పిల్లల పంపిణీ అప్పగించారు. 4. 29 కోట్ల చేప పిల్లల లక్ష్యం ఉండగా ఆలస్యం కావడంతో మొదటగా 2.20 కోట్లను ఖరారు చేయగా తాజాగా 80 లక్షలకు మాత్రమే జగిత్యాలకు చెందిన కాంట్రాక్టర్కు చేప పిల్లల సరఫరాకు అనుమతి ఇచ్చారు. అయితే సదర్ కాంట్రాక్టర్ ఇప్పటివరకు దానికి సంబంధించిన ఒప్పందం కూడా ఖరారు చేసుకోకపోవడంతో చేప పిల్లల పంపిణీ ప్రశ్నార్థకంగా మారుతుంది. ఒకవేళ పంపిణీ చేసిన చేప పిల్లల వృద్ధి చెందక మత్స్యకారులకు తీవ్ర నష్టం కలగనుంది

ఉపాధికి గండి

నిర్మల్ జిల్లాలో ఈ సీజన్ చేప పిల్లల విడుదల పై ప్రతిష్టంబర కొనసాగుతున్న నేపథ్యంలో చేప పిల్లలు విడుదల కాకపోతే మత్స్యకారములకు తీవ్ర నష్టం కలగనుంది. జిల్లాలో 13462 మంది మచ్చ కార్మికులు చేపల వృత్తిపై ఆధారపడి జీవిస్తున్నారు. దీనికి తోడు మరో వెయ్యి మంది కి పరోక్షంగా ఉపాధి దొరకనుంది. ఆగస్టు మాసంలో చేప పిల్లలు వేస్తే అవి జనవరి ఫిబ్రవరి నాటికి 600 నుంచి 800 గ్రాముల వరకు బరువు వచ్చేవని ఇప్పుడు చేప పిల్లలు వేసిన బరువు పరిణామం పెరగదని దీనివల్ల తమ ఉపాధికి గండిపడు తుందని మత్స్య కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

జనవరి మాస నుంచి జూన్ వరకు సాగునీటి వలలో చేపలు పట్టి వాటిని విక్రయించి దాని ద్వారా వచ్చిన డబ్బులతో కుటుంబ ఆర్థిక అవసరాలను తీర్చుకునే మత్స్య కార్మికులకు ఈ సంవత్సరం ప్రభుత్వ వైఖరి కారణంగా చేప పిల్లలు విడుదల కాకపోతే తమ కుటుంబాలు ఎలా నెట్టుకు రావాలని ప్రశ్నిస్తున్నారు. ఈసారి కురిసిన భారీ వర్షాల వల్ల చెరువులు ప్రాజెక్టులకు పెద్ద ఎత్తున వరద నీరు రావడంతో గతంలో పెంచిన చిన్న చేప పిల్లలు కొట్టుకుపోయాయని వారు ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వం వెంటనే మత్స్య కార్మికులకు ఆదుకునేలా చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.

త్వరలో చేప పిల్లల విడుదల

నిర్మల్ జిల్లాలో సాగునీటి వనరులు 100% సబ్సిడీపై త్వరలో వచ్చే పిల్లలను విడుదల చేయనున్నట్లు మత్స్యశాఖ జిల్లా అధికారి రాజనసయ్య తెలిపారు. జిల్లాలో 80 లక్షల చేప పిల్లల విడుదలకు ప్రభు త్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని వీటిని శ్రీరాంసాగర్ ప్రాజెక్టు కడెం నారాయణరెడ్డి రెడ్డి ప్రాజెక్ట్ స్వర్ణ ప్రాజెక్టులు పెద్ద చెరువుల్లో చేపల  విడుదల ఉంటుందన్నారు మచ్చ కార్మికులు ఎలాంటి ఆందోళన చెందవద్దన్నారు.

మత్స్యశాఖ జిల్లా అధికారి