17-11-2025 01:54:17 AM
మేడ్చల్ అర్బన్, నవంబర్ 16 (విజయక్రాంతి): గుండ్లపోచంపల్లి మున్సిపల్ పట్టణంలోని శ్రీ మల్లన్న దేవాలయం నందు శ్రీ గౌరీ సేవా సంఘం తెలంగాణ రాష్ట్ర శ్రీ నూకాంబిక ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో చిన్న పిల్లల ఆటపాటలు సంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించడం జరిగిందని మునిసిపల్ బిజెపి మాజీ కౌన్సిలర్ దొడ్ల మల్లికార్జున్ ముదిరాజ్ తెలియజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంస్కృతిగా కార్యక్రమాల్లో ఉత్తమ ప్రదర్శన చేసిన వారికి బహుమతులు ఇవ్వడం జరిగిందని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆరోమాసింగ్ ఠాకూర్, ఐజి డాక్టర్ నిర్మల రాజారాం, ప్రిన్సిపాల్ యు హరికృష్ణ, యాదవ సంఘం అధ్యక్షులు రాము యాదవ్, జగ్గారావు, జూబ్లీహిల్స్ అధ్యక్షులు సతీష్ కుమార్, ప్రోగ్రాం ఆర్గనైజర్ పాల్గొన్నారు.