calender_icon.png 17 November, 2025 | 4:00 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వైద్యశిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి

17-11-2025 01:56:56 AM

మేడ్చల్ నియోజకవర్గం బీబ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు వేముల మహేష్ గౌడ్ 

ఘట్ కేసర్, నవంబర్ 16 (విజయక్రాంతి) : ప్రజలు ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి మేడ్చల్ నియోజకవర్గం బీబ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు వేముల మహేష్ గౌడ్ అన్నారు. ఘట్ కేసర్ మున్సిపల్ పరిధిలోని ఘనపురం గ్రామంలో ఆదివారం నీలిమ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని మహేష్ గౌడ్ ప్రారంభించారు.

ఉచిత వైద్య శిబిరంలో డాక్టర్లు ప్రజలకు అన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులను పంపిణీ చేశారు. ఈకార్యక్రమంలో మాజీ సర్పంచ్ బద్దం గోపాల్ రెడ్డి, మాజీ ఉప సర్పంచ్ లు వేముల సత్తయ్య గౌడ్, వేముల పరమేష్ గౌడ్, మాజీ వార్డు సభ్యులు వేముల శంకర్ గౌడ్, నేతాజీ యువజన సంఘం అధ్యక్షులు వేముల అభిషేక్ గౌడ్, సభ్యులు వేముల శ్రావణ్ గౌడ్, తాటికొండ మణి గౌడ్, గ్రామస్తులు, ఆసుపత్రి వైద్య సిబ్బంది పాల్గొన్నారు.