calender_icon.png 17 November, 2025 | 4:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చీర్యాల లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఘనంగా సత్యనారాయణ స్వామి వ్రతాలు

17-11-2025 01:55:39 AM

కీసర, నవంబరు 16(విజయక్రాంతి): శ్రీ చీర్యాల లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో పవిత్ర కార్తీక మాసం చివరి ఆదివారం సందర్భంగా శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామి వ్రతాలు అత్యంత వైభవంగా నిర్వహించారు .

కార్తీక మాసం చివరి ఆదివారం విశిష్టత కారణంగా భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి , సామూహిక శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతంలో  పాల్గొన్నారు. వ్రతం అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించి పునీతులయ్యారు.

 కార్తీక దీపాలు, గోమాత పూజ: 

భక్తులు దేవాలయ ప్రాంగణంలో  ఉన్న సప్తవృక్షాలు , నాగదేవత వద్ద ప్రత్యేకంగా కార్తీక దీపాలను వెలిగించారు. గోమాతకు భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించి, తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణం అంతా ఆధ్యాత్మిక శోభ సంతరించుకొంది .  ఆలయ ఫౌండర్ , చైర్మన్ మల్లారపు లక్ష్మీనారాయణ , ధర్మకర్త శ్రీహరి పాల్గొన్నారు.