calender_icon.png 22 January, 2026 | 3:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం

22-01-2026 01:32:11 AM

జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్

జూబ్లీహిల్స్,జనవరి21(విజయక్రాంతి):యూసఫ్ గూడ డివిజన్ పరిధిలోని వెంకటగిరి ప్రాంత ప్రజలు ఎదుర్కొంటున్న తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపడమే తమ లక్ష్యమని జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఎమ్మెల్యే నవీన్ యాదవ్ అన్నారు. స్థానికంగా రూ.35 లక్షల వ్యయం తో చేపట్టిన నూతన తాగునీటి పైప్లైన్ పనులను బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలకు సురక్షిత మంచినీటిని అందించడమే ధ్యేయంగా ప్రభుత్వ సహకారంతో ముందు కు సాగుతున్నాం అన్నారు.

అందుకోసం నూతన పైప్లైన్ పనులను చేపట్టామన్నారు. అధికారులు నిర్ణీత వ్యవధిలో పనులు పూర్తి చేయాలన్నారు. త్వరలోనే ప్రతి ఇంటికి నిరంతర నీటి సరఫరా జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ సంజయ్ గౌడ్, రహ్మత్ నగర్ డివిజన్ కార్పొరేటర్ సియన్ రెడ్డి, నాయకులు భవాని శంకర్, మల్లికార్జున్, నాగార్జున రెడ్డి, జలమండలి డీజీఎం ఇంద్రశీలా రాణి తదితరులున్నారు.