22-01-2026 01:34:23 AM
తల్లి కళ్లముందే ముగిసిన చిన్నారి జీవితం
సికింద్రాబాద్ జనవరి 21. (విజయక్రాంతి): సికింద్రాబాద్‌లోని తిరుమలగిరి ఆర్మీ పాఠశాల సమీపంలో బుధవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం నగరాన్ని విషాదంలో ముంచింది. పాఠశాలకు వెళ్తున్న ఏడేళ్ల బాలుడు తల్లి కళ్లముందే మృత్యువు ఆలింగనం చేసుకోవడం హృదయాలను కలచివేసింది. నీలాంగ్ తమాంగ్(32) భర్త సంగం తమాంగ్ ఆర్మీ ఉద్యోగి, వారి కుమారుడు, నిజెన్ తమాంగ్ వయస్సు (8) సంవత్సరాలు ఆర్మీ పబ్లిక్ స్కూల్లో చదువుతున్నాడు. ఎప్పటిలాగే ఆర్కేపురం వంతెన నుంచి తల్లి తన కుమారుడిని స్కూటీపై పాఠశాలకు తీసుకెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
అదే సమయం లో రోడ్డుపై స్కూటీ అదుపుతప్పడంతో తల్లిబాలుడు ఇద్దరూ కింద పడిపోయారు. అదే సమయంలో వెనుక నుంచి వేగంగా దూసుకొచ్చిన ఆర్మీ వాహనంమోడ్ పే చేసిన అశోక లేలాండ్ స్కూల్ బస్ నెంబర్ 04డి 159699 కే.నిజెన్ తమాంగ్ కిందపడ్డ బాలుడి పైనుంచి వెళ్లింది. తీవ్ర గాయాలపాలైన చిన్నారి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ప్రమాదంలో తల్లికీ గాయాలయ్యాయని, ఈ దారుణ ఘటనకు సంబంధించిన దృ శ్యాలు సమీపంలోని సీసీటీవీ కెమెరాల్లో రికార్డు కావడంతో ప్రమాద తీవ్రత స్పష్టంగా బయటపడింది. ఈ ఘటనపై నీలాంగ్ తమాంగ్ మామ పోలీసులకు ఫిర్యాదు చేయటంతో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు..