calender_icon.png 17 September, 2025 | 5:30 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పెట్రోల్ స్కూటీలో మంటలు.. తప్పిన పెను ప్రమాదం

21-01-2025 08:31:00 PM

మంథని (విజయక్రాంతి): మంథనిలో పెట్రోల్ స్కూటీ మోపెడ్ కు ప్రమాదవశాత్తు మంటలు అంటుకొని దగ్ధం అయింది. స్థానికుల కథనం ప్రకారం... 8 ఇంక్లైన్ కాలనీ నుంచి మంథనికి వస్తున్న తగరం లింగయ్య- సమ్మక్కలు స్కూటీపై వస్తుండగా, స్కూటీ వెనుక భాగంలో కాలిపోయి పొగలు వ్యాపించాయి. వారి వెనుక నుంచి వస్తున్న ద్విచక్ర వాహనదారులు వెంటనే వారిని ఆపి ప్రమాదం నుండి తప్పించారు. స్కూటీ మంటలతో కాలిపోయింది. స్థానిక హెచ్ పి పెట్రోల్ బంకు ఎదురుగా ఈ సంఘటన జరగడంతో వెంటనే అక్కడ ఉన్న ఉద్యోగులు మంటలను ఆర్పీవేశారు. ఈ మంటలు ఒకవేళ దారి మధ్యలో జరిగితే పెను ప్రమాదం సంభవించి ఉండేదని దంపతులు ఆందోళనతో తెలిపారు. తమను రక్షించిన వారికి వారు కృతజ్ఞతలు తెలిపారు.