calender_icon.png 5 July, 2025 | 4:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఈసారి డేట్ మారదు.. రికార్డులు మారతాయి

04-07-2025 12:00:00 AM

పవన్‌కల్యాణ్ హీరోగా నటించిన పీరియాడికల్ డ్రామా ‘హరిహర వీరమల్లు’. ఏఎం జ్యోతికృష్ణ, క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో మెగాసూర్య ప్రొడక్షన్ పతాకంపై ఏ దయాకర్‌రావు నిర్మి స్తున్నారు. జూలై 24న విడుదల కానున్న ఈ సినిమా ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమం గురువారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ సందర్భంగా చిత్ర సమర్పకుడు, ఏఎం రత్నం మాట్లాడుతూ.. “చరిత్రను గుర్తుచేసే సినిమా ఇది.

ఈ చిత్రం ఇంత అద్భుతంగా రావడానికి నా కుమారుడు జ్యోతికృష్ణ ఎంతగానో శ్రమించాడు. ఇప్పటిదాకా మీరు పవర్ స్టార్‌ను చూశా రు.. ఈ సినిమాలో రియల్ స్టార్‌ను చూస్తారు. పవన్‌కల్యాణ్ సినీ జీవితంలోనే కాదు.. నిజజీవితంలోనూ రియల్ హీరో” అన్నారు. ‘ఈ సినిమాతో కచ్చితం గా బ్లాక్‌బస్టర్ కొట్టబోతున్నాం’ అని కథానాయిక నిధిఅగర్వాల్ అన్నారు. డైరెక్టర్ జ్యోతికృష్ణ మాట్లాడుతూ.. “అప్పట్లో ‘ఖుషి’ అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమాగా నిలిచింది.

ఆ తర్వాత తెలుగులో మొదటి వంద కోట్ల సినిమా గబ్బర్‌సింగ్. ఇప్పుడు ఈ సినిమాతో మరో భారీ విజ యం సాధించబోతున్నాం. ఈసారి డేట్ మారదు.. ఇండస్ట్రీ రికార్డులు మారతాయి”అన్నారు. ‘ఇది మా టీమ్ ఆరేళ్ల కష్టం. పవన్‌కల్యాణ్ హృదయంలోనుంచి వచ్చే మాటలను ప్రతిబింబించేలా ఈ సినిమా ఉంటుం ది’ అని దయాకర్‌రావు చెప్పారు.