calender_icon.png 2 August, 2025 | 12:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

త్వరలో కేజీబీవీ విద్యార్థులకు స్పోర్ట్స్ కిట్స్!

30-07-2025 12:49:55 AM

హైదరాబాద్, జూలై 29 (విజయక్రాంతి): రాష్ట్రంలోని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయా (కేజీబీవీ)ల్లో విద్యార్థులకు షూస్ పంపిణీ చేయనున్నారు. వీటితోపాటు స్పోర్ట్స్ కిట్స్ సైతం త్వరలోనే పంపిణీ చేయనున్నారు. రాష్ట్రంలోని దాదాపు 495 కేజీ బీవీ ప్రభుత్వ పాఠశాలల్లో ఆరో తరగతి నుం చి ఇంటర్ వరకు తరగతులు నడుస్తున్నా యి.

టెన్త్, ఇంటర్‌లో మంచి ఫలితాలు రావ డం, బాలికల భద్రతపై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల నేపథ్యంలో ఈ స్కూళ్లలో తమ పిల్లలను చేర్పించేందుకు తల్లిదండ్రులు ముందుకు వస్తున్నారు. ఇందులో చదివే విద్యార్థులకు షూస్, స్పోర్ట్స్ కిట్స్ ఇవ్వాలని అధికారులు నిర్ణయించారు. త్వరలోనే వీటిని అందజేస్తామని పాఠశాల విద్యాశాఖ సంచాలకుడు నవీన్ నికోలస్ తెలిపారు.