13-10-2025 12:00:00 AM
స్వామి వారి పాదాలను తాకిన లేలేత సూర్య కిరణాలు
ఆదిలాబాద్, అక్టోబర్ 12 (విజయక్రాంతి) : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా జైనథ్ లోని అతి ప్రాచీన శ్రీ లక్ష్మీ నారాయణ స్వామి ఆలయంలో అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది. ప్రతి ఏటా రెండుసార్లు ఆలయంలోని స్వామివారి మూలవిరాట్టు పాదాలను లేలేత సూర్య కిరణాలు తాకే అరుదైన దృశ్యం భక్తులను పులకరింప చేస్తోంది.
ఆంధ్రప్రదేశ్‌లోని అరసవెల్లి సూర్యనారా యణ స్వామి ఆలయంలో పాటు తెలంగాణ లోనిఆదిలాబాద్ జిల్లా జైనథ్ లోని శ్రీ లక్ష్మీ నారాయణ స్వామి ఆలయంలో ఈ సూర్యకిరణాలు స్వామి వారి పాదాలను తాకడం ఈ ఆలయం ప్రత్యేకత. ఇందులో భాగంగానే కార్తీకమాసంలో ఆదివారం తెల్లవారుజా మున సూర్యకిరణాలు నేరుగా స్వామివారి పాదాలను తాకాయి. ఆ సమ యంలో స్వామివారి మూలవిరాట్టు పూర్తిగా స్వర్ణ శోభితంగా కనిపిస్తోంది.