calender_icon.png 18 December, 2025 | 2:00 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆసియా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు

18-12-2025 12:26:14 AM

తలసేమియా చిన్నారుల కోసం డాక్టర్ బాలు రక్తదాన సేవలకు గుర్తింపు

కామారెడ్డి, డిసెంబర్ 16 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్, రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలుకు ప్రతిష్టాత్మకమైన ఆసియా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు దక్కింది. తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల కోసం 2023-24 2024-25 సంవత్సరాలలో మెగా రక్తదాన శిబిరాలు నిర్వ హించి, ఐదు వేల యూనిట్ల రక్తాన్ని సేకరించినందుకు గాను ఈ అవకాశం దక్కిందని డాక్టర్ బాలు తెలియజేశారు. భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా తనకు ఈ గుర్తింపు దక్కడం సంతోషంగా ఉన్నదన్నారకు.