calender_icon.png 26 July, 2025 | 6:23 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డుమ్మా కొడితే ఇక కుదరదు

13-12-2024 02:23:55 AM

  • టీచర్లకూ ఫేషియల్ రికగ్నిషన్ అటెండెన్స్
  • పెద్దపల్లి జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా అమలు

హైదరాబాద్, డిసెంబర్ 12 (విజయక్రాంతి): టీచర్లకు ఫేషియల్ రిక గ్నిషన్ అటెండెన్స్ (ఎఫ్‌ఆర్‌ఎస్)ను అమలు చేయనున్నారు. రాష్ట్రంలోని ప్రభుత్వ, లోకల్ బాడీ, మోడల్ స్కూళ్లు, కేజీబీవీ, గురుకులాలు, యూఆర్‌ఎస్ పాఠశాలల్లో పనిచేసే ఉద్యోగులకు అమలు చేయనున్నట్టు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఈవీ న ర్సింహారెడ్డి ఈ నెల 10న ఉత్తర్వులు జారీచేశారు. పైలట్ ప్రాజెక్టుగా పెద్దపల్లి జిల్లాల్లో అమలు చేయనున్నట్టు వెల్లడించారు.

ఇందుకు సంబంధిం చి చర్యలు చేపట్టాలని ఆ జిల్లా విద్యాధికారికి ఆదేశాలు జారీ చేశారు. నో డల్ అధికారి పర్యవేక్షించేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ఎఫ్‌ఆర్‌ఎస్ సిస్టం అమల్లో ఉంది. టీ చింగ్, నాన్ టీచింగ్ సిబ్బందికి కూ డా దీన్ని అందుబాటులోకి తేవాలని గతంలో అనుకున్నా.. వాయిదా ప డుతూ వచ్చింది. ఫలితాలను బట్టి ఆ తర్వాత అన్ని జిల్లాల్లో దీన్ని అమలు చేయనున్నారు.

ఇదిలా ఉంటే ఇప్పటికే అమల్లో ఉన్నా బయోమెట్రిక్ విధానాన్ని ఎత్తేసి కేవలం ఒకే జిల్లాల్లో పైలట్ ప్రాజెక్టు కింది ఫేషియల్ రికగ్నిషన్ అటెండెన్స్‌ను అందుబాటులోకి తీసుకొరా వడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. బడులకు గైర్హాజరవుతున్న టీచర్లు, ఇతర సిబ్బందిని గాడిలో పెట్టేందుకు ఎఫ్‌ఆర్‌ఎస్‌ను అమలు చేయనున్నారు.