26-11-2025 12:00:00 AM
జూకంటి జగన్నాథం :
రాజ్యాంగంలో ఓటు హక్కు గు రించి ఒక నిర్దిష్టమైన అధికరణ లేకపోయినా ప్రాథమిక హక్కు ద్వారా ప్రతి పౌరునికి ఓటు హక్కును వినియోగించుకునే అధికారం సంక్రమించిదన్న విష యం అందరికీ తెలిసిందే. గత నాలుగు దశాబ్దాలుగా దేశంలో జరుగుతున్న ఎన్నికల ఫలితాలను గమనిస్తే ఓటరు తీర్పులో పరిణితి, విలక్షణత స్పష్టంగా కనిపిస్తున్నాయి. మొన్నటికి మొన్న వివిధ రాష్ట్రా ల్లో జరిగిన ఎన్నికల సరళిని పరిశీలించి చూస్తే.. ఓటరులో లోతైన దార్శనిక త అగుపిస్తున్నది.
ఇటీవల జరిగిన ఒక ఎన్నికల్లో ఒక ఓటర్‌ను అడిగిన ఒక వ్యాసకర్తగా నేను అడిగిన ప్రశ్నలకు ఆయ న చెప్పిన జవాబులు పరిశీలించి చూస్తే ఈ విషయం మరింత స్పష్టంగా అర్థమవుతుంది. ఎవరికి వేస్తావు నీ ఓటు? ప్రశ్న వేయగా.. ‘ఇది వరకే రెండు పార్టీలు వచ్చి డబ్బులు ఇచ్చారు. కానీ మూడో పార్టీ పం చే డబ్బుల కోసం ఎదురుచూస్తున్నా’ అని ఓటరు సమాధానమిచ్చాడు. దీంతో ఓట రు మనసులో ఏముందనే దానికి సమాధానం దొరకలేదు.
రాజకీయ పార్టీల నాయకులు చూపే ఆశలకు, వాళ్లు పెట్టే ప్రలోభాలకు లొంగినట్టు కనిపించినప్పటికీ తీరా ఎన్నికల ఫలితాలు చూస్తే ఓటరు తీసుకునే నిర్ణయంలో బహు నేర్పరితనం, దక్షత స్పష్టంగా కనిపిస్తాయి. రానున్న కా లంలో ఎన్నికల ద్వారా భారతీయ ఓటరు ప్రజాస్వామ్యాన్ని గొప్ప మలుపు తిప్పే దిశ గా ఆశాజనక పరిస్థితి కనిపిస్తున్నది.
మిశ్రమ ప్రభుత్వాలు..
ఈ సందర్భంగా 1952 నుంచి 2024 వరకు జరిగిన 16వ లోకసభ ఎన్నికల ఫలితంగా ఏర్పడిన ప్రాంతీయ రాజకీయ పా ర్టీల రంగప్రవేశం, వాటి ప్రభావాల కారణంగా కేంద్రంలో ఏర్పడిన మిశ్రమ ప్రభు త్వాల గురించి విశ్లేషించుకోవలసిన సమ యం ఆసన్నమైంది. 1952 నుంచి 1977 వరకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు ఏర్పా టు చేయడంలో తనకు ఎదురు లేదని నిరూపించుకున్నది. అయితే 25 ఏళ్లకే కాంగ్రెస్ పార్టీ విధానాలకు వ్యతిరేకంగా జయప్రకాశ్ నారాయణ ఆధ్వర్యంలో జరిగిన ఉద్యమం కారణంగా 1977లో జరిగి న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమి పాలైం ది.
అనంతరం మొట్టమొదటిసారిగా వివి ధ రాజకీయ పార్టీలతో కూడిన కాంగ్రెసేతర మిశ్రమ ప్రభుత్వం ‘జనతా పార్టీ’ అధి కారంలోకి వచ్చింది. మొరార్జీ దేశా య్ ప్రధానమంత్రిగా రెండు సంవత్సరాల 128 రోజులకే చీలిక వచ్చి, చరణ్ సింగ్ ప్రధానమంత్రి అయ్యారు. ఆయన సైతం 170 రోజులకే పదవి వీడిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. జనతా పార్టీ ప్రయోగం విఫలమైన తర్వాత ఇందిరాగాంధీ మరోసారి తిరిగి అధికారంలోకి వచ్చింది. కానీ పంజాబ్ ఉగ్రవాదుల చేతిలో ఆమె మరణించారు.
ప్రాంతీయ పార్టీల హవా!
ఇదే కాలంలో ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ కీలుబొమ్మ ప్రభుత్వాల ఏర్పాటుకు వ్యతిరేకంగా సినీ నటుడు ఎన్టీ రామారావు తెలుగువారి ఆత్మగౌరవం పేరుతో ‘తెలుగుదేశం’ ప్రాంతీయ పార్టీని 1983లో స్థాపిం చి కొద్దికాలంలోనే అధికారంలోకి వచ్చా రు. అప్పటికే తమిళనాడులోనూ ప్రాంతీ య పార్టీల హవా కొనసాగుతున్నది. అటు కేరళ, బెంగాల్, త్రిపురలో వామపక్ష వాదుల ప్రభుత్వాల పాలన అప్రతిహతం గా నడుస్తున్నది.
ఇందిరాగాంధీ హత్యానంతరం 1984లో జరిగిన ఎన్నికల్లో సానుభూతి పవనాలు వీయడంతో ఇందిరా గాంధీ కుమారుడు రాజీవ్ గాంధీ ప్రధాన మంత్రి అయ్యారు. తర్వాత 1989లో జరిగిన ఎన్నికల్లో ఏ ఒక్క పార్టీకి లోకసభలో మెజార్టీ రాకపోవడంతో నేషనల్ ఫ్రంట్ పేరుతో విపి సింగ్ ప్రధానమంత్రిగా ప్రభుత్వాన్ని కొనసాగించారు. కానీ రామ్ మందిర్, మండల్ కమిషన్ ఉద్యమం దేశంలో అశాంతిని రేకెత్తించింది. తత్ఫలితంగా వి.పి. సింగ్ 143 రోజులు..
అనం తరం చంద్రశేఖర్ 223 రోజుల పిదప అనేక లుకలుకల మధ్య ప్రధాని పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. దక్షిణాది రాష్ట్రాలకు తోడు ఉత్తరాదిలోని ఝార్ఖండ్, ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు అధికారం చేపట్టాయి. నాటి నుం చి నేటి వరకు ప్రాంతీయ పార్టీల భాగస్వా మ్యం లే కుండా ఏ ఒక్క జాతీయ పార్టీ ప్రభుత్వాల మనుగడ కొనసాగించలేకపోతున్నాయి. భాషా సంస్కృతులు, ఆయా రాష్ట్రాల మధ్య కేంద్రం చూపించే వివక్ష, అసమానతలే దీనికి ప్రధాన కారణాలు.
ఆర్థిక సంక్షోభం..
1991లో పదో లోకసభ ఎన్నికల్లో పీవీ నరసింహారావు ప్రధాన మంత్రి పదవి చేపట్టారు. ఈ కాలంలో ఆర్థిక సంస్కరణలు పేరుతో సరళీకరణ యుగం ఆరంభమైంది. 1996లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కుల, ప్రాంతీయ రాజకీయాలు అధి కారంలోకి వచ్చాయి. యునైటెడ్ ఫ్రంట్ ఏర్పడి అవినీతి, ఆర్థిక కుంభకోణాలు తలెత్తడంతో మిశ్రమ ప్రభుత్వం రెండు సంవ త్సరాలకే జనతాదల్ అధికారం నుంచి దిగిపోయింది.
1998లో జరిగిన ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో అట ల్ బిహారీ వాజ్‌పేయి ప్రధానమంత్రిగా యునైటెడ్ ఫ్రంట్ మిశ్రమ ప్రభుత్వం ఏర్పడింది. అనతి కాలంలోనే 1999లో జరిగిన ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ కూటమి ఐదేళ్లు దేశాన్ని పాలించగా, వాజ్‌పేయి ప్రధాన మంత్రిగా కొనసాగారు. ఆ తర్వాత 2004లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్ (యూపీఏ) ప్రభు త్వం ఏర్పడింది.
చాలా రోజుల తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం, మన్మోహన్ సింగ్ పూర్తి కాలం ప్రధానమంత్రిగా పనిచేశారు. 2009లో 15వ లోకసభకు జరిగిన ఎన్నికల్లో మరోసారి కాంగ్రెస్ ఆధ్వర్యంలోని యూపీఏ కూటమి రెండోసారి అధికారంలోకి వచ్చింది. కానీ ఈమారు యూపీఏ ప్రభుత్వం కూడా పెద్ద మొత్తంలో సరళీకరణ, సంస్కరణల అమలులో మందకొడితనం, పెద్ద ఎత్తున ఆర్థిక కుంభకోణాల సహా రకరకాల ఆరోపణలను ఎదుర్కొంది.
అప్పుల్లో రాష్ట్రాలు..
ఇక 2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ మెజార్టీ సా ధించి మోడీ ఆధ్వర్యంలో ప్రభుత్వాన్ని ఏ ర్పాటు చేసి ఇప్పటివరకు కొనసాగుతుంది. 2024లో జరిగిన సార్వత్రిక ఎన్నిక ల్లో మెజార్టీ సాధించడంలో విఫలమైన బీజేపీ పార్టీ.. ఎన్డీఏ కూటమిలో భాగస్వాములుగా ఉన్న తెలుగుదేశం సహా బీహార్ లోని జేడీయూ లాంటి ప్రాంతీయ పార్టీల మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. దీంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరోమారు కేంద్రంలో చక్రం తిప్పే అవకాశం లభించింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ర్ట అవసరాల కోసం టీడీపీ మద్దతుతో కొనసాగుతున్న కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి పెద్ద మొత్తంలో నిధుల ను, వివిధ ప్రాజెక్టులను సాధించుకుంటున్నారు. ఇటు తెలంగాణ రాష్ర్టంలో మా త్రం పదేళ్లు అధికారాన్ని అనుభవించిన బీఆర్‌ఎస్ పార్టీపై ఏర్పడ్డ వ్యతిరేకతను తమకు అనుకూలంగా మలుచుకోవడం చాతుర్యం ప్రదర్శించిన రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ దశాబ్దంన్నర త ర్వాత రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది.
అయితే రేవంత్ తన హామీలను, పరిమిత ఆర్థిక వనరుల దృష్ట్యా 2023 ఎన్నికల్లో ప్రజలకు చేసిన వాగ్దానాలను, ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ప్రతికూలతలను ఎదుర్కొంటున్నారు. దేశం అనుసరి స్తున్న ఆర్థిక విధానాలు, ఉచితాల వల్ల రుణ భారం పెరిగిపోతుంది. ఇటు రాష్ట్రా లు ప్రణాళిక బద్దంగా వ్యవహరించలేక ప్రజలు కోరుకొని ఉచిత పథకాల అమలు కారణంగా అప్పుల్లో కూరుకుపోతున్నా యి.
‘రాజ్యాంగం అమలుపరచడంలో అ ధికార రాజకీయ పార్టీలు చిత్తశుద్ధి ఉం డా లి లేకుంటే, రాజ్యాంగం పౌరులకు ప్రసాదించిన హక్కులు తిరిగి ప్రశ్నార్ధకమవు తాయి’. అని అంబేద్కర్ రాజ్యాంగంలో చెప్పిన విషయాన్ని నేడు ప్రస్తావించడం చాలా అవసరం.
వ్యాసకర్త సెల్: 9441078095