26-11-2025 12:00:00 AM
ఐశ్వర్యం జ్యేష్ఠభాగితు
పూజ్యతే కులస్యవా
భవేద్రాజ్యం కులసంఘో హి దుర్జయః
(కౌటిలీయం - 1-1-7)
రాజ్యపాలన ఉదాత్తమైన బాధ్యత. మామూలు పరిస్థితుల్లో రాజ్యపాలన పెద్ద కుమారునికే చెందడం సహజం.. లేదా మొత్తం కులానికే చెందవచ్చు. ఎవరు పాలించినా ప్రజల పట్ల దయ, ఔదార్యత కలి గి ప్రజలకు ఏ బాధా కలగకుండా పాలించాలి అంటాడు ఆచార్య చాణక్య. సాధారణంగా ప్రజల్లో పాలకుల పట్ల అంచనాలు చాలా ఎక్కువగా ఉంటాయి. సత్యం మరొక విధంగా ఉండవచ్చు. ఈ రెండింటి మధ్య దూరమెంత తక్కువగా ఉంటే రాజ్యమంత సుభిక్షంగా ఉంటుంది.
రాజ్యంలోని ప్రజలు ఆర్థికంగా, సామాజికంగా, ఆరోగ్యంగా సమున్నతంగా ఎదిగితే.. శాంతి సౌభాగ్యాలు వెల్లివిరుస్తాయి. జీవితం యొక్క విలువ సంపదను పెంచుకోవడం, పంచుకోవడంపైనే ఆధారపడుతుంది. ఆ భావన లేని జీవితం ప్రయోజన రహితం. పాలకులు కనే కలలు వాటిని సాకారం చేసుకు నే దార్శనికత, క్రమశిక్షణ, పట్టుదల, నిరంతర ప్రయత్నం ప్రజల స్థాయిని ఉన్నతీ కరిస్తుంది.
కలలు కనడమంటే.. అసాధారణ వ్యక్తులూ అసాధ్యమనుకున్న ఎత్తులో అవకాశాలను గుర్తించడం, బాధ్యతగా ప్రవర్తించడం, లక్ష్యసాధనకై మొండిపట్టుదలతో ప్రయత్నించడమే. అవకాశాలను సద్వినియోగం చేసుకోవడం, బాధ్యతలను పంచుకోవడం కలలను సాకారం చేసుకోవడంలో ప్రధాన భూమికను పోషిస్తుంది. బాధ్యత వ్యక్తి జీవితంలో మార్పుకు స్వాగ తం పలుకుతుంది.
బాధ్యతలను పంచే నాయకుడు బృందంలోని ప్రతి వ్యక్తికీ అసాధారణమైన లక్ష్యాలను నిర్దేశించాలి. వాటిని సాధించడానికి అవసరమైన శిక్షణను, వనరులను సమకూర్చాలి. ఆచరణా త్మకమైన ఆశలు, ఆకాంక్షలు గలిగిన కార్పోరేట్ నాయకులెవరైనా ఒక సంవత్సరంలో నా సంస్థలో ఇన్ని ఉద్యోగాలు కల్పిస్తానని నిశ్చయంగా చెప్పగలగాలి.
నిద్రలేని రాత్రులెన్నో!
ఉత్సాహం శక్తినిస్తుంది. ఔత్సాహికులైన పారిశ్రామికవేత్తలు సంస్థలను స్థాపిస్తారు. అయితే ఎదురయ్యే విపత్తులకు ఉత్సా హం, శక్తిసామర్ధ్యాలు ఒక్కొక్కమారు నీరుకారిపోగా భయపడి కొద్ది కాలానికే సం స్థను అమ్మేయడం కనిపిస్తుంది. అది సమర్ధనీయంకాదు. సంస్థ ఆశయాల సాధనలో నిర్వాహకులు ఎన్నో ఎత్తుపల్లాలను చవిచూడాల్సి వస్తుంది. ఎన్నో నిద్రలేని రాత్రు లు గడిపాకే అంతిమ ఫలితాలను ఆస్వాదించగలుగుతారు.
వివేచనతో కూడిన కఠోర పరిశ్రమ లేకుండా ఎవరూ విజయాన్ని సాధించలేరు. సాధారణంగా తన గురించిన అవగాహన పరిమితంగా ఉండ డం, భయం.. అహంకారం.. ఫలితాలకు అతుక్కుపోయి ప్రక్రియను, విలువలను వదిలివేయడం.. బుద్ధికి, విచక్షణ జ్ఞానానికి కాక మనసుకు ప్రాధాన్యతనివ్వడం వల్ల వ్యక్తుల సామర్థ్యం పరిమితమౌతున్నది. పరిమితులను చెరిపివేసుకుంటే అద్భుత ఫలితాలను సాధించడం సాధ్యమే.
ప్రభుత్వాలు అసామాన్య దార్శనికత కలిగిన ఔ త్సాహికులైన పారిశ్రామికవేత్తలకు అవసరమైన అనుమతులు త్వరగా అందివ్వడం, ఆర్థిక వనరులను సమకూర్చుకోవడంలో సహాయపడడం, దేశవిదేశ వాణిజ్యానికి అనువైన పరిస్థితులను కల్పించి.. అవరోధాలను తొలగించడం వల్ల పరిశ్రమల స్థా పన జరుగుతుంది. ఇది పెట్టుబడిదారులకు వెన్నుకాయడం కాదు. దీనివల్ల ప్రజ లకు ఉపాధి కల్పన సులువవుతుంది. పో టీతత్వంతో సృజనశీలత పెరుగుతుంది. ప్రజలు మానసికంగానూ, ఆర్థికంగానూ సంతృప్తిని చెందుతారు.
పరిమితులను అధిగమిస్తేనే..
అడవిలో ఒక పులి ప్రసవించి మరణించింది. దారిన వెళుతున్న మేకల కాపరి పు లి పిల్లను జాలితో చేరదీసి తన మందతో కలిపి పెంచాడు. మేకలతో కలసి పెరిగిన పులిపిల్లకూ మేకల అలవాట్లన్నీ వచ్చాయి. పులి కనిపిస్తే పారిపోవాలని బోధించే పెద్ద మేకల మాటలు పులిపిల్లకు ఒంటపట్టా యి. ఒకనాడు అడవిలో మేకలన్నీ మేస్తుండగా పులి వచ్చింది. పులిని చూసి మేకల తో పాటుగా పులిపిల్లా పారిపోవడం చూ సిన పులి ఆశ్చర్యంతో దానిని పట్టుకొని ఎందుకు పారిపోతున్నావని అడిగింది.
పులిపిల్ల తాను మేకనని, నీవు పులివి కాబట్టి నన్ను తింటావని చెప్పింది. పులి నవ్వుతూ దానిని ఒక నీటి మడుగు వద్దకు తీసుకువెళ్ళి నీటిలో దాని ప్రతిబింబాన్ని, తన రూపాన్ని చూడమని చెప్పింది. రెంటి నీ పోల్చిచూసుకున్న పులిపిల్ల మేకలతో తన రూపాన్ని పోల్చుకొని.. తాను మేక కాదని, పులినని గుర్తించింది. మేకననే భ్రాంతిని వదిలివేసి పులిగా జీవించింది. వ్యక్తి తన శక్తి సామర్ధ్యాలను గుర్తించగలిగితే పరిమితులను అధిగమించి అసాధార ణ ఫలితాలను సాధిస్తాడు.
సాధారణంగా మనసుకు, మనోపరిమితులకు మధ్య సం ఘర్షణ జరుగుతుంది. మనసు చైతన్యాన్ని, మేధను, అనుభవాలను, సకారాత్మక ఆలోచనలను, ఊహాశక్తిని ఆలంబనగా చేసుకొ ని ముందుకు సాగుతుంది. మనోపరిమితులు నమ్మకాలు, దృష్టికోణం, వైఖరి, అలవాటుపడిన ఆలోచనారీతికి దర్పణం గా నిలుస్తూ.. పరిమితుల్లో నడిపిస్తాయి. ఎప్పుడైనా మనసుకు మనోపరిమితులకు మధ్య సంఘర్షణ తలెత్తితే మనోపరిమితులను అధిగమించేందుకు ప్రయత్నించాలి.
సృజనాత్మకమైన కొత్త ఆలోచనా సరళిని కలిగిన నాయకులు తమ ఉత్పత్తులు లేదా సేవలు సాధారణ ప్రజలకు ఎంతవరకు ఉపకరిస్తాయో నిరంతరం పరిశీలిస్తూ, మార్కెట్ పరిణామాలను అంచనా వేస్తూ నాణ్యతను గౌరవిస్తూ.. వ్యాపారంలో విలువలను పెంచుతారు. దానికి అవసరమైన సమర్ధత, విలువలను తాము సాధిస్తూ.. బృందంలో ఆ స్ఫూర్తిని నింపేందుకు కృషి చేస్తారు.
గుర్తింపుతోనే గౌరవం..
నిజానికి అభ్యుదయమైనా, మార్పైనా సులువుగా లభించవు. హార్బర్ నౌకలకు రక్షణనిస్తుంది. కాని నౌకలను హార్బర్లలో ఉంచేందుకు ఉద్దేశించి నిర్మించరు. ప్రమాదకరమే అయినా అవి సముద్రంలోకి వె ళ్ళాలి. ఆ తత్వాన్ని గుర్తించిన పారిశ్రామికవేత్తలే.. ఆత్మవిశ్వాసం, జాతీయతా భావన లు ప్రాతిపదికగా పనిని ప్రేమిస్తూ సంపదను సృష్టిస్తారు, అందులోనే ఆనందాన్ని పొందుతారు. ఆ మధ్య ఇన్ఫోసిస్ నారాయణమూర్తిగారు ప్రతి వ్యక్తీ వారంలో 72 గంటలు పనిచేయాలని చెప్పినప్పుడు వివాదాస్పదమయింది.
నిజానికి అసాధారణ ప్రతిభావంతులైన నాయకులు, నా యకులుగా పరివర్తన చెందాలని భావించే వ్యక్తులు రోజుకు 12 గంటల చొప్పున 6 రోజులు, నాణ్యమైన పనిచేయాలి. దానితో ఉత్పత్తి ఉత్పాదకతలు పెరుగుతాయి. ప్రతిభాపూర్ణ నిర్వహణా దక్షత వ్యక్తికి గుర్తింపు నిస్తుంది. గుర్తింపు గౌరవాన్నిస్తుంది. గౌర వం వల్ల అధికారం, శక్తి లభిస్తాయి. అందువల్ల అధికారం కావాలనుకునే వారు కార్య సాధనలో ప్రభావవంతంగా పనిచేయాలి.
ప్రధాని మోదీగారు వారానికి 100 గంటలకన్నా ఎక్కువ సమయమే పనిచేస్తున్నా రు. వారేకాదు వారి మంత్రివర్గ సహచరులు, ముఖ్యులైన అధికారులు, కొందరు సీఎంలు, ఎందరో పారిశ్రామికవేత్తలు భారతదేశ గౌరవాన్ని ఆర్థిక స్థితిని ఉన్నతీకరించేందుకు నిరంతరం శ్రమిస్తూనే ఉ న్నారు. ఆత్మవిశ్వాసం, సృజనాత్మకమైన ఆలోచనల విస్తృతి కలిగిన నాయకులే జాతి దశా దిశలను మార్చగలరు.
-వ్యాసకర్త: పాలకుర్తి రామమూర్తి