27-12-2025 02:23:10 AM
బండ్లగూడ జాగిర్, డిసెంబర్ 26 (విజయక్రాంతి): బండ్లగూడ మున్సిపల్ కార్పొ రేషన్ 14వ డివిజన్ పరిధిలోని ఫెబెల్ సిటీ రోడ్డు పనులు నత్తకు మేనత్తగా తయారయ్యాయి.. అధికారుల నిర్లక్ష్యం కారణంగా గత కొన్ని నెలలుగా రోడ్డు పనులు కోన సా..గుతూనే ఉన్నాయి. సాధన మెడికల్ కాలేజీకి సమీపంలోని పేబెల్ సిటీ రోడ్డు ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని గతంలో బండ్లగూడ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ఈ రోడ్డు నిర్మాణనికి రూ : 2 కోట్లు మరియు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణానికి రూ : 50 లక్షల నిధులు కేటాయించారు.
ఈ పనులకు టెండర్లు నిర్వహించి పనులు త్వరగా చేపట్టేందుకు కాంట్రాక్టర్ కు పనులను అప్పగించారు. ఈ ఏడాది అక్టోబర్ 15న రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ రోడ్డు నిర్మాణానికి శిల ఫలకాన్ని కూడా ఆవిష్కరించారు. ఇంతవరకు బాగానే ఉన్నప్ప టికీ పనులు మాత్రం అనుకున్నం త వేగంగా కొనసాగడం లేదు. గతంలో నిర్మించిన అం డర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు కూడా అసంపూర్తిగానే ఉన్నాయి.
నవంబర్ మొదటి వారంలో పలుమార్లు పత్రికలో వార్తలు వచ్చిన సందర్భంలో మున్సిపల్ డీఈఈ యాదయ్య మాట్లాడుతూ డిసెంబర్ చివరి నాటికి రోడ్డు పనులను ఎట్టి పరిస్థితుల్లో పూర్తి చేస్తామని చెప్పినప్పటికీ రోడ్డు పనుల విషయంలో నేటికీ ఒక అడుగు కూడా ముందుకు పడకపోవడం విశేషం.. రోడ్డు నిర్మాణానికి సం బంధించి మున్సిపల్ కార్పొరేషన్‌లో నిధులు పుష్కలంగా ఉన్నప్పటికీ పనులు చేయడంలో అటు అధికారులు ఎం దుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారో అర్థం కాని పరిస్థితి.
సంబంధిత కాంట్రాక్టర్ తో పనులు చేయించడంలో అధికారుల కు ఎందుకు అలసత్వమని పేబల్ సిటీ స్నేహిత హిల్స్ కాలనీవాసులు ప్రశ్నిస్తున్నారు. శుక్రవారం సమీపంలోని షాపుల్లో నుండి వచ్చిన నీరు రోడ్డుపై పెద్ద ఎత్తున నిలిచిపోవడంతో ఎక్కడ గుంత ఉందో ఎలా వెళ్ళా లో తెలియని పరిస్థితిలో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు.
ఫోన్లో స్పందించని మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్
నత్త నడకన.. అసంపూర్తిగా కొనసాగుతున్న పేబల్ సిటీ రోడ్డు పనుల విషయమై మున్సిపల్ కమిషనర్ శరత్ చంద్రను వివరణ కోరెందుకు ఫోన్లో ప్రయత్నించగా ఆయన ఫోన్ లో అందుబాటులోకి రాలేదు.
రోడ్డు పనులను వెంటనే పూర్తి చేయాలి
గత కొన్ని నెలల నుండి రెబల్ సిటీ రోడ్డు అస్తవ్యస్తంగా తయారైంది ప్రభుత్వం నిధులు కేటాయించినప్పటికీ పనులు చేయడంలో కాంట్రాక్టర్ చేయించడంలో అధికారులు ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు తెలియదు. ఇప్పటికైనా అధికారులు సిటీ రోడ్డు పనులను పూర్తి చేసి ఇబ్బందులు తొలగించాలని స్నేహిత హిల్స్ కు చెందిన సాక వెంకటయ్య మున్సిపల్ అధికారులను కోరారు.
సాక వెంకటయ్య, స్నేహిత హిల్స్