22-01-2026 12:23:40 AM
బీసీఐఎఫ్ రాష్ట్ర కోఆర్డినేటర్లు కర్నాటి మనోహర్, అవ్వారు వేణు కుమార్
సిద్దిపేట క్రైం, జనవరి 21 : ఉమ్మడి మెదక్ జిల్లాలో సిద్దిపేట వేదికగా సామాజిక న్యాయ సభ ను త్వరలో నిర్వహిస్తామని బీసీఐఎఫ్ రాష్ట్ర కోఆర్డినేటర్లు కర్నాటి మనోహర్, డాక్టర్ అవ్వారు వేణుకుమార్ తెలిపారు. బుధవారం సిద్ధిపేట పట్టణంలో బీసీ ఇంటలెక్చువల్ ఫోరం జిల్లా శాఖ ఆధ్వర్యంలో బీసీఐఎఫ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కాజీపేట సత్యనారాయణ నేతృత్వంలో ప్రెస్ క్లబ్ లో బీసీ సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు.
ముఖ్య అతిధులుగా హాజరైన మనోహర్, వేణుకుమార్ మాట్లాడుతూ, బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు కావాలంటే రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో చేర్చి రాజ్యాంగ రక్షణ కల్పించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు సామాజిక న్యాయం కల్పిస్తామని కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ ద్వారా స్పష్టమైన హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే వి ద్య, ఉద్యోగాలు, స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లు చట్టబద్ధంగా అమలు చేస్తామని ప్రకటించిందని, కానీ ఇప్పటివరకు అమలు చేయలేదని విమర్శించారు.
రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే అఖిల పక్ష సమావేశం నిర్వహించాలని కోరారు. అన్ని రాజకీయ పార్టీల సందేహాలను నివృత్తి చేయాలన్నారు. అఖిల పక్ష ప్రతినిధి బృందాన్ని ఢిల్లీకి తీసుకెళ్లి 42% రిజర్వేషన్ల బిల్లును తొమ్మిదో షె డ్యూల్లో చేర్పించాలని డిమాండ్ చేశారు. వచ్చే ఎంపీటీసీ, జడ్పిటీసీ ఎన్నికల్లో బీసీలకు 42 శా తాన్ని అమలు చేసేంతవరకు ఎన్నికలకు వెళ్ళవద్దని సూచించారు.
రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షం గా ఉన్న బీఆర్‌ఎస్, ప్రేక్షక పాత్ర వహించడం మానేసి, ఉద్యమించాలని కోరారు. మేమెంతో మా కంత అని, మా నినాదం హిస్సా,ఇజ్జత్, హుకుమత్ అని పిలుపునిచ్చారు. సమావేశంలో లోక్ సత్తా పార్టీ స్టేట్ ప్రెసిడెంట్ తుమ్మనపల్లి శ్రీనివాస్, శ్రీశైలం ముదిరాజ్, శానంగారి చంద్రశేఖరాచారి, అన్నలు దాసు, వెంకటేశం, వెంకటేశ్వరరావు, అంజా గౌడ్, గౌసుద్దీన్, ధర్మ సమాజ్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కర్రోళ్ల రవిబాబు, భిక్షపతి, బాల్ నర్సయ్య, పాల్గొన్నారు.