13-05-2025 01:30:47 AM
- సీఎంపై ఇష్టానుసారంగా మాట్లాడితే ఊరుకోం
- పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌గౌడ్ హెచ్చరిక
హైదరాబాద్, మే 12 (విజయక్రాంతి): బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్‌రెడ్డి ఏ కులానికి చెందిన వ్యక్తి? రెడ్డి కులమా? లేక ముదిరాజ్ కులమా? క్లారిటీ ఇవ్వాలని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్‌గౌడ్ ప్రశ్నించారు. ఆయనది ఏ కులమో ఆయనకే క్లారిటీ లేదన్నారు.
సోమవారం మహేశ్‌గౌడ్ గాంధీభవన్‌లో ఎంపీ అనిల్‌కుమార్ యాద వ్, పీసీసీ అధికార ప్రతినిధి నిజాముద్దీన్, గజ్జి భాస్కర్, ఇందిరాశోభన్ తదిరులతో కలిసి మీడియాతో మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డిపై ఇష్టానుసారంగా మాట్లాడితే కాంగ్రెస్ కార్యకర్తలు ఊరుకోరని ఎంపీ ఈటలకి మాస్ వార్నింగ్ ఇచ్చారు.
బీజేపీ ప్రెసిడెంట్ పద వి దక్కలేదన్న ఆక్రోశంలో ఈటల రాజేందర్ అలా మాట్లాడుతున్నారని మహేశ్ మండిపడ్డారు. ఎంతో రాజకీ య అనుభవం ఉన్న ఆయన.. సీఎం రేవం త్‌రెడ్డి గురించి మాట్లాడిన తీరు సభ్య సమా జం తలదించుకునే విధంగా ఉందన్నారు. రాష్ట్రం దివాళా తీయడంలో కారణమైన కేసీఆర్ ఆలీబాబా 40 దొంగల బ్యాచ్‌లో ఈటల ఒకడంటూ ఎద్దేవా చేశారు.
ఈటల.. నీవు నసగాడివి: జగ్గారెడ్డి
బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్‌పై పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ధ్వజమెత్తారు. ఈటల రాజేందర్ ఒక నసగాడని, అందుకే కేసీఆర్ బీఆర్‌ఎస్ నుంచి బయటికి వెళ్లగొట్టారని విమర్శించారు. సోమవారం ఆయన గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడారు. ‘ఈటల రాజేందర్ నాపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. నేను రౌడీలకు రౌడీని, గుండాలకు గుండా ను. మంచివాళ్లకు మంచి వాన్ని. మర్యాద ఇస్తే మర్యాద ఇస్తా. నీవు ఒక్కటి తిడితే.. నేను వంద తిడుతా. నేను కౌన్సిలర్‌గా ఉన్నప్పుడు.. నీవు రాజకీయంగా ఓనమాలు కూడా నేర్చుకోలేదు. విమర్శలు చేసే ముందు జాగ్రత్తగా ఉండా లి’ అని జగ్గారెడ్డి హెచ్చరించారు. ఈటల నస తట్టుకోలేకే కేసీఆర్ పార్టీ నుంచి వెళ్లగొట్టాడని, కానీ కాంగ్రెస్ నేతలను రాజేందర్ తట్టుకోలేరని తెలిపారు.
ఈటల మతి భ్రమించింది: ఎంపీ చామల
ఈటలకు బీజేపీపై ఉన్న ఆక్రోశాన్ని సీఎం రేవంత్‌రెడ్డిపై చూపించడం కరెక్ట్ కాదని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. ఈటల రాజేందర్‌కు మతి భ్రమించిదని విమర్శించారు. బీఆర్‌ఎస్‌లో పంచాయితీ పెట్టుకొని బీజేపీలోకి వెళ్లిన ఆయనకు, అక్క డ పరిస్థితి అర్థం కావడం లేదన్నారు. పార్టీ అధ్యక్ష పదవి వస్తుందని, సీఎం అయిపో వచ్చనే పిచ్చి ఆలోచనతో ఈటల ఉన్నారని, బీజేపీలోని సీనియర్ నేతలు ఈటలను లాస్ట్ బెంచ్‌కే పరిమితం చేశారన్నారు. ఈటల సమస్య బీజేపీ పార్టీతోనని.. అది పట్టించుకోవడం లేదన్నారు.
ఈటల.. చెల్లని 2వేల నోటు: మెట్టు
ఎంపీ ఈటల రాజేందర్ చిల్లరగా మాట్లాడు తున్నాడని, ఆయన రద్దయిన రూ.2 వేల నోటు అని పిషర్‌మెన్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్ విమర్శించారు. ఈటల రాజేందర్‌ను బీజేపీలో ఎవ రూ పట్టించుకోకపోవడంతోనే సీఎం రేవంత్‌రెడ్డితో పాటు కాంగ్రెస్ నేతలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు.
సోమవారం గాంధీ భవన్‌లో సాయికుమార్ మీడియాతో మాట్లాడుతూ.. ఈటల వాడుతున్న భాషను తామూ ఉపయోగిస్తే ఈటల తట్టుకోలేరని అన్నారు. సీఎంను మరోసారి చులకనగా మాట్లాడితే ఊరుకునేది లేద ని మెట్టుసాయికుమార్ హెచ్చరించారు. రేవంత్‌రెడ్డికి వస్తు న్న ఆదరణను తట్టుకోలేకనే రాజేందర్ ఏడుస్తున్నాడని విమర్శించారు.