calender_icon.png 2 October, 2025 | 4:10 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వయో వృద్ధులకు ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయాలి

02-10-2025 02:28:31 AM

ఘట్ కేసర్, అక్టోబర్ 1 (విజయక్రాంతి): పోచారం మున్సిపాలిటీ కొర్రెముల లోని సుప్రభాత్ టౌన్ షిప్ లో తెలంగాణ ఆల్  సీనియర్ సిటీజన్స్ అసోసియేషన్ (టాస్కా) ఆధ్వర్యంలో 35వ అంతర్జాతీయ వయో వృద్ధుల దినోత్సవం బుధవారం అధ్యక్షులు బంగారి రాజయ్య ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో వయోవృద్ధులైన జె. కొమురయ్య, ఎస్. సత్యనారాయ ణలకు శాలువలతో సన్మానించారు.

ఈసమావేశం ఉద్దేశించి టాస్కా కార్యదర్శి ఆళ వందార్ వేణు మాధవ్ మాట్లాడుతూ వృ ద్ధులు ఎదుర్కొంటున్న  సవాళ్ళను  అధిగమించాలని 1990లో ఐక్యరాజ్యసమితి జన రల్ అసెంబ్లీ ప్రతిపాదన మేరకు 1991 అక్టోబర్ 1 నుంచి ప్రపంచవ్యాప్తంగా అంతర్జా తీయ వయో వృద్ధుల దినోత్సవం జరుపుతున్నారని తెలిపారు. వయోవృద్ధులు తమ ఆరోగ్యo పట్ల శ్రద్ధ వహిస్తూ, ఉప్పు, పంచదార, క్రొవ్వు పదార్థాలు తక్కువ మోతా దులో తీసుకోవాలని,

తగిన వ్యాయామం, నడక కొనసాగించాలని, ప్రతి రోజు 7 నుంచి 8 గంటలు నిద్రించాలని, వృధ్యా ప్యం అనివార్యం కనుక ఎక్కువ సమయం బంధు, మిత్రులతో సమయం గడుపుతూ ప్రశాంత జీవితాన్ని గడపాలన్నారు. తెలంగాణా రాష్ట్రంలో దాదాపు 40 లక్షల మంది వృద్ధులు ఉన్నారని, ప్రతి ఐదు వయో వృద్ధుల కుటుంబాలలో ఒక కుటుంబం ఆస్తులు కోల్పోయి, ఆదరణ లేక బాధ పడుతున్నారని పేర్కొన్నారు.

తల్లిదండ్రులు, వయోధికుల పోషణ, సంక్షేమ చట్టం-2007 పటిష్టంగా అమలు పరచాలని, కనుక రాష్ట్ర ప్రభుత్వం వృద్ధుల కమిషన్ ఏర్పాటు చేయాలని, ప్రతి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వృద్ధుల సంక్షేమం కొరకు ప్రత్యేక అధికారి నియమించి నిధులు కేటాయించి, ప్రతి గ్రామంలో వృద్ధుల మనో వికాస కేంద్రాలు ఏర్పాటు చేయాలని, వృద్దులకు ఆరోగ్య భీమా సౌకర్యం కల్పించాలని, ప్రభుత్వాలు వయోధికులకు, రైలు,

బస్సు ప్రయా ణంలో రాయితీలు కల్పించాలని, ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులలో అన్ని రకాల జబ్బులకు ఉచిత వైద్య చికిత్స చేయాలని,తల్లి తండ్రులను పోషించలేని వ్యక్తులను కఠినంగా శిక్షించాలని తెలిపారు. టాస్కా అధ్య క్షులు బంగారి రాజయ్య, కార్యదర్శి ఆళవందార్ వేణు మాధవ్, కొట్టే మల్లయ్య, ఎం. రాజనర్సు, సత్యనారాయణ, లక్ష్మినారాయణ, ఎ. ప్రభాకర్, చుక్కల నర్సయ్య, హర నాథ్, ప్రతాప్ సింగ్, సర్జిత్ సింగ్, బంగారి మల్లయ్య, టి. శ్రీనివాస్ పాల్గొన్నారు.