calender_icon.png 2 October, 2025 | 4:12 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రిటైర్మెంట్ ప్రయోజనాలు అందడంలేదు

02-10-2025 01:22:59 AM

  1. మానసిక క్షోభకు గురవుతున్నాం
  2. రిటైర్డ్ ఎంప్లాయీస్ బెన్‌ఫిట్స్ సాధన సమితి

హైదరాబాద్ సిటీ బ్యూరో, అక్టోబర్ 1 (విజయక్రాంతి): రిటైర్డ్ ఎంప్లాయీస్ బెన్‌ఫిట్స్ సాధన సమితి తెలంగాణ ఆధ్వర్యంలో బుధవారం పబ్లిక్ గార్డెన్స్‌లో  శ్రీదర్ల ధర్మేంద్ర (రిటైర్డ్ ప్రిన్సిపాల్, ప్రభుత్వ జూనియర్ కళాశాల హనుమకొండ)అధ్యక్షతన సమావేశం జరిగింది. 2024 మార్చి నుంచి ఇప్పటివరకు ఉద్యోగ విరమణ పొందిన ఉద్యోగులు, ఉపాధ్యాయులకు ప్రభుత్వం నుంచి ఎలాంటి రిటైర్మెంట్ ప్రయోజనాలు అందలేదని, 18 నెలల గడిచినప్పటికీ పెన్షన్ తప్ప ఎలాంటి ప్రయోజనాలు అందక మానసిక క్షోభకు గురవుతున్నామని, మనోవేదనతో అసువులు బాసిన వాళ్లు కూడా ఉన్నారని అన్నారు.

ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి తెచ్చి ప్రయోజనాలను సాధించు కోవాలని వక్తలు అభిప్రాయపడ్డారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 2024 మార్చి నుండి రిటైర్మెంట్ అయిన ఉద్యోగులు, ఉపాధ్యాయులు అందరూ సుమారు 30 మంది హాజరయ్యారు. ఉద్యోగ విరమణ పొందిన వారికి జిపిఎఫ్, జిఐఎస్, లీవ్ ఎన్కాష్మెంట్, కమ్యూటేషన్, గ్రాట్యూటి, సర్విస్‌లో ఉన్నప్పుడు పెట్టుకున్న సరెండర్ లీవు బకాయిలు అందించని ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి తీసుకురావాలని సమావేశం అభిప్రాయపడింది.

కాగా ఈ నెల 5న ఉమ్మడి వరంగల్ జిల్లా పబ్లిక్ గార్డెన్స్‌లో సమావేశంమై నూతన కార్యవర్గం ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. ఈ సమావేశంలో కడారి భోగేశ్వర్, కందుకూరి దేవదాసు, యండి. గఫార్(ఉపాద్యాయ సంఘాల నాయకులు), చంద్ర మౌళి(రిటైర్డ్ డిప్యూటి సీఈఓ), యండి మహబూబ్ అలీ, సూర కుమార స్వామి, ఎం దామోదర్, కె.శ్యామ్ రావు, పి.వెంకటేశ్వర్లు, కె.శ్యామ్, కె.శ్రీనివాస్, బి.లక్ష్మినారాయణ, పి.సంజీవరెడ్డి,  సదయ్య, విశ్వనాథం, ఇంద్రసేనారెడ్డి, ఏ సురెందర్, చంద్రమౌళి (రిటైర్డ్ ప్రొఫెసర్), ఎస్ వీరయ్య, భారత కృష్ణమూర్తి, రత్నాకర్‌రెడ్డి ,లక్ష్మీనివాస్ తదితరులు పాల్గొన్నారు.