02-10-2025 01:47:03 AM
హైదరాబాద్, అక్టోబర్ 1 (విజయక్రాంతి) : కాళేశ్వరం ప్రాజెక్టులో భాగం గా నిర్మించిన మేడిగడ్డ బరాజ్ పునరుద్ధరణపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారిం చింది. దీంతోపాటు అన్నారం, సుందిళ్ల బరాజ్‌ల మరమ్మతులు చేయించనున్నది. ఇందులో భాగంగా నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్‌ఏ) సూచనల మేరకు డిజైన్లు, డ్రాయింగ్స్ సిద్ధంచేసేందుకు కాంట్రాక్టు సంస్థల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తూ, టెండర్ ప్రకటన జారీచేసింది.
2023 అక్టోబర్ 21వ తేదీన మేడిగడ్డ బరాజ్‌లోని ఏడో బ్లాకు కుంగింది. సుందిళ్ల, అన్నారం బరాజ్‌ల్లోనూ భారీగా సీపేజీలు బయటపడ్డా యి. ఈ రెండు బరాజ్‌లకు తాత్కాలికంగా మరమ్మతులు చేసినప్పటికీ నీటి నిల్వకు అవకాశం లేకుండా పోయింది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర జల శక్తి మంత్రిత్వ శాఖకు లేఖ రాయగా, సీడబ్ల్యూసీ మాజీ చైర్మన్ చంద్రశేఖర్ అయ్య ర్ నేతృత్వంలో నిపుణుల కమిటీని ఎన్డీఎస్‌ఏ నియమించింది.
ఈ కమిటీ గత ఏడాది మే నెలలో ప్రాథమిక నివేదిక ఇచ్చింది. డిజైన్లు, నిర్మాణం, నాణ్యత, ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ సహా అనేక వైఫల్యాలున్నట్టు గుర్తించింది. బరాజ్‌ల్లో నీటిని నిల్వ చేయడానికి వీల్లేదని, అలా చేస్తే మరింత నష్టం వాటిల్లుతుందని పేర్కొంటూ కొన్ని డిజైన్లు, డ్రాయింగ్‌లనూ సూచించింది. ఈ మేరకు మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్‌ల పునరుద్ధరణ, రెస్టోరేషన్ డిజైన్ల కోసం ప్రసిద్ధ డిజైన్ ఏజెన్సీల నుంచి ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్‌ను (ఈవోఐ) ఆహ్వానించింది.
సెం ట్రల్ డిజైన్స్ ఆర్గనైజేషన్ చీఫ్ ఇంజినీర్ కార్యాలయానికి డిజైన్ ఏజెన్సీలు తమ ప్రతిపాదనలను సీల్ చేసిన కవర్లలో అక్టోబర్ 15వ తేదీ మధ్యా హ్నం 3 గంటలలోపు సమర్పించాలని సూ చించింది. అదే రోజు సాయంత్రం 5 గంటల కు జలసౌధ భవనంలోని కాన్ఫరెన్స్ హాల్‌లో ఈ కవర్లు ఓపెన్ చేస్తామని తెలిపింది.
ఈ ప్రక్రియలో ఎంపికైన ఏజెన్సీలు ఎన్డీఎస్‌ఏ కమిటీ సూచనల మేరకు బరాజ్‌ల పునరుద్ధరణ డ్రాయింగులు, డిజైన్లు సిద్ధం చేయాల్సి ఉం టుందని పేర్కొంది. పూర్తి వివరాలను నీటిపారుదల శాఖ అధికారిక వెబ్‌సైట్‌లో ఉంచినట్టు ఆ శాఖ ఉన్నతాధికారులు పేర్కొన్నారు.