calender_icon.png 2 October, 2025 | 8:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్థానిక ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరాలి

02-10-2025 02:24:11 AM

మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి 

చేవెళ్ల, అక్టోబర్ 1: స్థానిక సంస్థల ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరవేయాలని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రా రెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం చేవెళ్ల మండలం ముడిమ్యాలలో జీకేఆర్ ఫామ్ హౌజ్ లో డిసీఎంఎస్ చైర్మన్ పట్లోళ్ల కృష్ణా రెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు పెద్దోళ్ల ప్రభాకర్, మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ గోనె కరుణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడుస్తున్నా ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని విమర్శించారు.

రాష్ట్రంలో ఎక్కడికి వెళ్లినా కేసీఆర్ ను ఓడగొట్టి తప్పు చేశామని బాధ పడుతున్నారని వాపోయారు. రంగారెడ్డి జిల్లాలో అన్ని జీపీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచులు గెలుచు కోవాలని, ఆ మేరకు నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని కోరారు. పార్టీ తరఫున ఆశావహులు ఎక్కువగా ఉండే కూర్చొని మాట్లాడుకోవాలని సూచించారు. రిజర్వేష న్ తమకు అనుకూలంగా రాలేదని నిరుత్సాహ పడొద్దని..

వచ్చిన వారి కోసం కష్ట పడి పనిచేయాలని చెప్పారు. కేసీఆర్ తో మాట్లాడి నియోజక వర్గానికి ఇంచార్జిని పెడతామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కనీస వేతనాల కమిటీ మాజీ చైర్మన్ నారాయణ, బీఆర్ ఎస్ నియోజకవర్గ మాజీ అధ్యక్షుడు దేశమొల్ల ఆంజనేయులు, మాజీ వైస్ ఎంపీపీ కర్నే శివ ప్రసాద్, యూత్ అధ్యక్షుడు వంగ శ్రీధర్‌రెడ్డి, సీనియర్ నాయ కులు హన్మంత్ రెడ్డి, శేరి రాజు, శ్రీనివాస్, దర్శన్, ఆంజనేయ గౌడ్, ఊరడి రాములు, ప్రభాకర్ రెడ్డి, గోనె రాఘవేందర్ రెడ్డి, శివ కుమార్, మహమ్మద్, కావాలి శేఖర్, మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.