02-10-2025 02:27:02 AM
అఖిల భారతీయ సహ సంఘటన కార్యదర్శి బాలకృష్ణ, ముఖ్యఅతిథి ఎడ్ల బాల్ రాజ్
కందుకూరు, అక్టోబర్ 1 : దేశ నిర్మాణమే ఆర్‌ఎస్‌ఎస్ లక్ష్యం అఖిల భారతీయ సహ సంఘటన కార్యదర్శి బాలకృష్ణ,ముఖ్యఅతిథి ఎడ్ల బాల్ రాజ్ లు అన్నారు. రాష్ట్రీయ స్వయంసేవక సంఘ ఆధ్వర్యంలో సంఘ శతాబ్దిలో భాగంగా బుధవారం విజయదశమి కార్యమాన్ని మండలంలోని కొత్తగూడలో నిర్వహించారు.ఈ సందర్భంగా స్వయంసేవక సోదరులను ఉద్దేశించి వారు ప్రసంగించారు.
1925లో స్థాపించినటువంటి ఆర్‌ఎస్‌ఎస్ నేటికీ సమాజంకి దిశ, నిర్దేశాన్ని చేస్తూ పంచ పరివర్తన్ పేరుతో పర్యావరణం పట్ల అవగాహనతో ప్లాస్టిక్ నిషేధించాలని, స్వదేశీ ప్రోత్సహిస్తూ విదేశీ వస్తువులను వాడకూడదని,పౌర విధులు పాటిస్తూ సమాజానికి ఆదర్శంగా నిలవాలనీ సమర సతతో మిలుగుతూ అంటరానితనాన్ని రూపుమాపాలని అన్నారు.
ఆదర్శ హిందూ గృహం లక్షణాల్ని పాటిస్తూ ధర్మనిరతితో కుటుంబజీవనం సాగించాలని కోరారు.గ్రామంలో స్వయం సేవకులు పద సంచలన్ నిర్వహించారు.ఈ కార్యక్రమంలో పలు గ్రామాల నుండి స్వయం సేవకులు, నాయకులు,మహిళలు,పెద్దలు పాల్గొన్నారు.