26-01-2026 12:15:26 AM
ఎమ్మెల్యే మేఘా రెడ్డి
వనపర్తి, జనవరి 25 ( విజయక్రాంతి ) : త్వరలోనే వనపర్తి పట్టణ నడిబొడ్డున శ్రీకృష్ణ ఆలయ నిర్మాణం చేపట్టేందుకు తన వంతు సహాయ సహకారాలు అందజేస్తానని వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి పేర్కొన్నారు. జిల్లా కేంద్రం లో గల జంగిడిపురం లోని యాదవ కమ్యూనిటీ హాల్ కు సంబంధించి పై అంతస్తు నిర్మాణానికి ఎమ్మెల్యే ప్రత్యేక నిధుల నుంచి రూ. 10 లక్షలు మంజూరు చేసిన సందర్భంగా ఆదివారం నిర్మాణానికి సంబంధించిన భూమి పూజ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వనపర్తి నియోజకవర్గ పరిధిలోని యాదవుల అభివృద్ధి కోసం ఎల్లవేళలా కృషి చేస్తానని ఎమ్మెల్యే చెప్పారు. కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి గొల్ల వెంకటయ్య, న్యాయవాది మోహన్ యాదవ్, వనపర్తి పట్టణ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ పాకనాటి కృష్ణయ్య, కౌన్సిలర్లు, ఎల్‌ఐసి కృష్ణ, నక్క రాములు, జంపన్న, రవి యాదవ్, నాగేంద్ర యాదవ్, రాముడు యాదవ్ యాదవ కమ్యూనిటీ సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.