calender_icon.png 26 November, 2025 | 5:27 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహిళా సాధికారత దిశగా ముందడుగు

26-11-2025 12:00:00 AM

- మహిళలని కోటీశ్వరులు చేయడమే ప్రభుత్వ లక్ష్యం 

- మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు

పాపన్నపేట/ చిన్నశంకరంపేట, నవంబర్ 25 :మహిళా సాధికారత దిశగా ప్రభు త్వం ముందడుగు వేస్తోందని, మహిళలను కోటీశ్వరులను చేయడమే ప్రభుత్వ లక్ష్యమని మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్రావు తెలిపారు. మంగళవారం పాపన్నపే ట, చిన్నశంకరంపేట మండలాల్లో మహిళా స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాల పంపిణీ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు, అ దనపు కలెక్టర్ నగేష్ హాజరయ్యారు.

ఈ సందర్భంగా జిల్లాకు సంబంధించి 30 కోట్ల రూపాయలు నియోజకవర్గానికి సంబంధించి రెండు కోట్ల 88 లక్షల రూపాయల చెక్కులను అందజేశారు. పాపన్నపేట మండ లం పొడ్చన్ పల్లి రైతు వేదికలో స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాల చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. అలాగే చిన్నశంకరంపేట మండలంలోని కోరిపల్లి గ్రామానికి చెందిన లబ్ధిదారులకు పత్రాలను అందజేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు మాట్లాడుతూ రాష్ట్రంలో కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ సంకల్పానికి నిదర్శనంగా మరోసారి రాష్ట్రంలోని మూడు లక్షల 50 వేల స్వయం సహాయక మహిళా సంఘాలకు 304 కోట్ల రూపాయల వడ్డీ లేని రుణాలను ప్రభుత్వం అం దించనుందని తెలిపారు. ఇందుకుగాను మంగళవారం ఒకేరోజు రాష్ట్ర వ్యాప్తంగా వడ్డీ లేని రుణాలను మూడో విడత అందించేందుకు శ్రీకారం చుట్టిందన్నారు.

ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రెండుసార్లు వడ్డీ లేని రుణాలను ఇచ్చిన విషయం తెలిసిందే. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మహిళలను కోటీశ్వరులుగా చేస్తామని, వారి కాళ్ళ మీద వారిని నిలబడేలా తీర్చిదిద్ది కుటుంబాలను అభివృద్ధి చేసేందుకు, తద్వారా మహిళలు ఆర్థికంగా ఎదిగి స్వయం సమృద్ధి సాధించేందుకు చర్యలు తీసుకుంటామన్న ప్రజా ప్రభుత్వ హామీ మేరకు మహిళలకు అన్ని రంగాలలో అవకాశాలు కల్పిస్తుందన్నారు.

ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పించిందన్నారు. అనంతరం అదనపు కలెక్టర్ నగేశ్ మాట్లాడారు. పాపన్నపేట కార్యక్రమంలో ఎంపీడీ వో విష్ణువర్ధన్, ఎంపీఓ శ్రీశైలం, ఏపీఎం రాజు, పాపన్నపేట మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గోవింద నాయక్ , ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.