01-11-2025 12:00:00 AM
జిల్లా మత్స్య పారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షులుగా గోనెల శ్రీనివాస్ ప్రమాణ స్వీకారంలో ఎమ్మెల్యే ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి
మహబూబ్ నగర్ టౌన్, అక్టోబర్ 31: మత్స్యకారులకు సముచిత స్థానం కల్పించడం మహబూబ్ నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శుక్రవారంజిల్లా మత్స్య పారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షులు (పర్సన్ ఇన్చార్జ్)గా గోనెల శ్రీనివాస్ అంబేద్కర్ కళాభవన్లో జరిగిన కార్యక్రమంలో ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి హాజరై మాట్లాడారు.
అధ్యక్ష పదవిని స్వీకరించిన గోనెల శ్రీనివాస్ను ఎమ్మెల్యే ప్రత్యేకంగా అభినందించారు. పార్టీ కోసం కష్టపడిన ప్రతి ఒక్కరికి కాంగ్రెస్ పార్టీ సముచిత గౌరవం ఇస్తుంది అన్నారు. సీనియర్ నాయకులు ఉన్నా కూడా యువతను ప్రోత్సహించాలనే దృక్పథంతో గోనెల శ్రీనివాస్కి ఈ బాధ్యతలు అప్పగించామని తెలిపారు. నిజాయితీతో, చిత్తశుద్ధితో పనిచేసే నాయకుడు గోనెల శ్రీనివాస్ అని ఎమ్మెల్యే ప్రశంసించారు.
మత్స్యకారుల సంక్షేమం కోసం ప్రభుత్వ పథకాలు అర్హులైన వారికి చేరేలా సంఘం చురుకుగా పనిచేయాలని సూచించారు. చెరువులపై ఆధారపడిన మత్స్యకారుల ఆదాయవృద్ధి, మార్కెట్ విస్తరణ, ఉపాధి సృష్టిలో సంఘం కీలక పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. గ్రామాల వరకు సంక్షేమ పథకాలు సక్రమంగా అమలు చేయడంలో నాయకులు, సంఘ ప్రతినిధులు ముందుండాలి అన్నారు.
ఈ సమావేశంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహ్మారెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పెద్ద విజయ్ కుమార్, డిసిసి ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రీ, వేముల కృష్ణయ్య, డిసిసి కార్యదర్శి టంకర కృష్ణయ్య యాదవ్, హన్వాడ మండల కాంగ్రెస్ అధ్యక్షులు వి. మహేందర్, మైత్రి యాదయ్య, శరత్, ప్రవీణ్ కుమార్, రామకృష్ణ ముదిరాజ్, స్వరూప, రంజిత్ కుమార్, లింగం నాయక్, తుప్పలి ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.