calender_icon.png 20 October, 2025 | 12:02 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇయర్ ఎండింగ్‌లో ముచ్చటగా మూడింటితో

19-10-2025 12:34:49 AM

ఉప్పెన.. కృతిశెట్టి టాలీవుడ్‌లో నటించిన తొలి సినిమా. ఆ ఒక్క సినిమాతోనే తెలుగు నాట పాపులర్ అయిపోందీ బ్యూటీ. ఆ తర్వాత శ్యామ్‌సింగరాయ్, బంగార్రాజు సినిమాల తోనూ సక్సెస్ అందుకుంది. ఇక అప్పటినుంచి గత ఏడాది ‘మనమే’ వరకూ కృతికి కలిసి వచ్చిన చిత్రమే లేదు. తెలుగులో స్టార్‌డమ్ వస్తే ఆ ప్రభావం పాన్‌ఇండియా స్థాయిలో ఉంటుందని ఇక్కడ అవకాశాల కోసం ఎదురుచూసింది. ఈలోగా కోలీవుడ్ నుంచి ఛాన్సులు రాగా అవి చేస్తూ వస్తోంది.

కృతి తమిళంలో మొదట సైన్ చేసిన సినిమా ‘జినీ’. రవిమోహన్ లీడ్‌రోల్‌లో నటిస్తున్న ఈ చిత్రంలో కృతి హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాతోపాటు ‘ఎల్‌ఐకే ఇన్సూరెన్స్ కంపెనీ’ టైటిల్‌తో ఒక యూత్‌ఫుల్ మూవీ చేస్తోంది. ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాను విఘ్నేష్ శివన్ రూపొంది స్తున్నారు. దీంతోపాటు కార్తి హీరోగా నటిస్తున్న ‘వా వాతియార్’లోనూ కృతిశెట్టినే నాయిక. ఈ మూడు చిత్రాలూ ఒకే నెలలో రాబోతున్నాయి. ‘వా వాతియార్’ డిసెంబర్ 5 విడుదలవుతుండగా, ‘ఎల్‌ఐకే’ డిసెంబర్ 18న రిలీజ్ అవుతోంది.

ఇక ‘జినీ’ సినిమాను కూడా మేకర్స్ అటూఇటుగా డిసెంబర్‌లోనే విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇదిలా ఉండగా కృతిశెట్టి కెరీర్ గురించి ఫిల్మ్‌నగర్ సర్కిళ్లలో ఓ ఆసక్తికర చర్చ జరుగుతోంది. వరుస ఫ్లాపుల కారణంగా నిరాశతో ఉన్న కృతికి మున్ముందు అవకాశాలను ఈ మూడు సినిమాలే నిర్ణయిస్తాయన్న అభిప్రాయం నెటిజన్లలో వ్యక్తమవుతోంది. తమిళంలో రాబోతున్న ఈ 3 సినిమాలు ఒకదానికి మించి మరొకటి అనేలా ఉన్నాయన్నని, వీటిలో ఏ ఒక్కటి వర్క్‌అవుట్ అయినా ఈ అమ్మడి కెరీర్‌కు ఢోకా ఉండదని చెప్పుకుంటున్నారు. చూడాలి మరి, ఈ మూడింటిలో కృతిశెట్టికి ఇండస్ట్రీతో బలమైన బంధాన్ని ముడివేసే సినిమా ఏదో!