19-10-2025 12:33:11 AM
స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు సొంత బ్యానర్ శ్రీవేంకటేశ్వర క్రియేషన్స్‌లో ఇటీవల ఓ సినిమాకు కొబ్బరికాయ కొట్టిన సంగతి తెలిసిందే. విజయ్ దేవరకొండ హీరోగా దిల్ రాజు నిర్మిస్తున్న ప్రాజెక్టులో కీర్తి సురేశ్ భాగమైంది. ఈ చిత్రానికి రవికిరణ్ కోలా దర్శకుడు. విభిన్నమైన కథతో రూపొందుతోందని ప్రచారం జరగటంతో ఈ సినిమాపై మొదట్నుంచీ భారీ అంచనాలు నెలకొ న్నాయి. తాజాగా కీర్తి సురేశ్ పుట్టినరోజు సందర్భంగా ఓ ప్రత్యేక పోస్టర్‌ను ఎస్‌వీసీ విడుదల చే సింది.
ఈ పోస్టర్ చూస్తే.. కీర్తి చాలా బలమైన పాత్రలో నటిస్తున్నట్టు తెలుస్తోంది. అందుకే వరుస సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ ఈ సినిమాకు సైన్ చేసిందని అర్థమవుతోంది. తా జా పోస్టర్‌లో కీర్తి సురేశ్ నీడ లా కనిపిస్తూ ఆకట్టుకుంటోంది. పోస్టర్‌పై రాసి ఉన్న కవితాత్మకమైన వ్యాఖ్యలు ఆలోచింపజేసేలా ఉన్నాయి. ‘ఆమె ప్రేమ ఓ కావ్యం లాం టిది. ఆమె ఆత్మ ఒక పాట లాంటిది’ అని రాసి ఉన్న ఈ పోస్టర్‌తోనే మేకర్స్ ఈ సినిమాపై అంచనాలు పెంచేశారు.