calender_icon.png 29 November, 2025 | 12:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చిచ్చర పిడుగు వచ్చేశాడు

29-11-2025 12:06:07 AM

అండర్-19 ఆసియాకప్‌కు వైభవ్

ముంబై, నవంబర్ 28: దుబాయి వేదికగా జరగనున్న అండర్-19 ఆసియాకప్ కో సం భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. యువ క్రికెటర్ ఆయూశ్ మాత్రేను కెప్టెన్ గా ఎంపిక చేసింది. విహాన్ మల్హోత్రానికి వైస్ కెప్టెన్సీ అప్పగించారు. అలాగే చిచ్చర పిడు గు వైభవ్ సూర్యవంశీకి కూడా చోటు దక్కిం ది. ప్రస్తుతం దేశవాళీ క్రికెట్ లో జరుగుతున్న సయ్యద్ ముష్తాక్ అలీ ట్రోఫీ 2025 లో బీహార్ తరఫున ఆడుతున్న 14 ఏళ్ల వైభ వ్ సూర్యవంశీ అంతర్జాతీయ క్రికెట్ లోనూ సత్తా చాటుతున్నాడు.

ఐపీఎల్‌లో రాజస్థాన్ తరపున శతకంతో అదరగొట్టిన వైభవ్ ఇటీవల ఆసియాకప్ రైజింగ్ స్టార్స్ టోర్నీలోనూ రెచ్చిపోయాడు. పరుగుల వరద పారిస్తూ పలు రికార్డులు బ్రేక్ చేశాడు. ఇప్పుడు అండ ర్-19 ఆసియాకప్ లోనూ ఆడబోతున్నాడు. ఎనిమిది జట్లు ఆడుతున్న ఈ టోర్నీలో రాహుల్ కుమార్, హేమచుదేశన్ జె, బికె కిషోర్, ఆదిత్య రావత్ లను స్టాండ్బై ప్లేయర్లుగా ఎంపిక చేశారు.

డిసెంబరు 12 నుంచి 21 వరకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా అండర్-19 ఆసియా కప్ టోర్నీ జరుగు తుంది. వన్డే ఫార్మాట్ లో జరగనున్న ఈ టో ర్నీలో గ్రూప్-‘ఎ’ నుంచి భారత్, పాకిస్తాన్, క్వాలిఫయర్ 1 విజేత, క్వాలిఫయర్ 3 విజేత, గ్రూప్-‘బి’ నుంచి బంగ్లాదేశ్, శ్రీలంక, అఫ్గనిస్తాన్, క్వాలిఫయర్-2 విజేత రేసులో ఉన్నాయి.

అండర్-19 ఆసియా కప్‌కు భారత జట్టు

ఆయుశ్ మాత్రే (కెప్టెన్), విహాన్ మల్హోత్రా (వైస్ కెప్టెన్), వైభవ్ సూర్యవంశీ, వేదాం త్ త్రివేది, అభిజ్ఞాన్ కుందు (వికెట్ కీపర్), హర్వంశ్ సింగ్ (వికెట్ కీపర్), యువరాజ్ గోహిల్, కనిష్క్ చౌహాన్,  కిషన్ కుమార్ సిం గ్, ఉద్ధవ్ మోహన్, ఆరోన్ జార్జ్, ఎ.పటేల్, నమన్ పుష్పక్, డి. దీపేశ్, హెనిల్ పటేల్.

స్టాండ్ బై ప్లేయర్లు

రాహుల్ కుమార్, హేముచుందేశన్ జె, బీకే కిషోర్, ఆదిత్య రావత్.