29-11-2025 12:07:25 AM
వైరల్‌గా హర్ష్ గోయెంకా ట్వీట్
న్యూఢిల్లీ, నవంబర్: ఐపీఎల్‌లో మరో ఫ్రాంచైజీ అమ్మకానికి ఉందా.. అంటే అవుననే అంటున్నారు ప్ర ముఖ వ్యాపారవేత్త హర్ష్ గోయెంకా. 2025 సీజన్ లో విజేతగా నిలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ)ని అమ్మేందుకు దాని యాజమాన్యం డియోజియో ఇండియా ప్రయత్నాలు మొదలుపెట్టింది. దీని విలువ దాదాపు 17 వేల కో ట్లుగా అంచనా వేస్తున్నారు. హోంబలే ఫిలి మ్స్‌తో పాటు అదానీ గ్రూప్, ఇంకా పలు కార్పొరేట్ దిగ్గజాలు ఆర్సీబీ కోసం ప్రయత్నిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. డియాజి యోకు అమెరికా అతిపెద్ద మార్కెట్‌గా ఉంది.
అయితే అక్కడ సుంకాలు పెరగడం, వినియోగదారుల తగ్గడంతో ప్రీమియం మద్యం అమ్మ కాలపై ప్రభావం పడడంతో ఆ సంస్థ..ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ఈ క్రమంలోనే ఆర్సీబీ ఫ్రాంచైజీని అమ్మేసేందుకు సిద్ధపడినట్టు సమాచారం. రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీ కూడా అమ్మకానికి ఉన్నట్టు తనకు తెలిసిందని హర్ష్ గోయెంకా ట్వీట్ చేశారు. ఈ రెండు ఫ్రాంచైజీలను కొ నుగోలు చేసేందుకు ఐదుగురు బయ్యర్స్ రేసులో ఉన్నారని, పుణే, అహ్మదాబాద్, ముంబై, బెం గళూరు, అమెరికాలో ఎవరికి ఈ జట్లు దక్కుతాయో అని ఎక్స్ వేదికగా వెల్లడించారు. దీనిపై రాజస్థాన్ రాయ ల్స్ ఇంకా స్పందించలేదు.